OG Public Talk: పవర్ స్టార్ ‘OG’ పబ్లిక్ టాక్.. మతిపోతుంది భయ్యా..!

తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ క్రేజ్ ఊపేస్తోంది. ఇవాళ రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ షోస్ ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. ఈ చిత్రం కోసం థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలంతో పండుగ వాతావరణం కనిపిస్తోంది.

New Update

రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ క్రేజ్ ఊపేస్తోంది. ఈ మూవీ రేపు అంటే సెప్టెంబర్ 25న రిలీజ్ కానుండగా.. ఇవాళ రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ షోస్ ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం కోసం థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం, డప్పుల మోతతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యాక్షన్ చూసేందుకు అభిమానులు ఉత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. 

OG Public Talk

థియేటర్ల వద్ద వారి హంగామా చూస్తే పండుగ వాతావరణం కనిపిస్తోంది. చిన్నా పెద్దా, ఆడా మగా, ముసలి ముతక అనే తేడా లేకుండా జనాలు థియేటర్ల వద్ద తండోపతండాలుగా గుమిగూడారు. టపాసులు పేల్చుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. భారీ, ఎతైన కటౌట్లు, పోస్టర్లతో దుమ్ము లేపుతున్నారు. థియేటర్ల దగ్గర అభిమానుల సందడి, కోలాహలం చూస్తే సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది. 

సినిమా థియేటర్లు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అభిమానులు ఉదయం నుంచే క్యూలలో నిలబడి జై పవన్, జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. పటాకులు పేల్చి, డ్యాన్సులు చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో మరో భారీ హిట్ అవుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 

Advertisment
తాజా కథనాలు