/rtv/media/media_files/2025/10/18/og-ott-release-2025-10-18-12-51-59.jpg)
OG OTT Release
OG OTT Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ మూవీ ‘OG’ థియేటర్లలో దుమ్మురేపి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 23, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Once upon a time in Mumbai, there lived a storm. And now, he’s back. 🌪️ pic.twitter.com/gILAkqzAW5
— Netflix India (@NetflixIndia) October 18, 2025
Also Read: 'నా డార్లింగ్ సో స్వీట్'.. ప్రభాస్ ని పొగిడేస్తున్న ముద్దుగుమ్మ..!
OG on Netflix from OCT 23
ఇటీవలే థియేటర్లలో విడుదలైన OG, తొలి రోజు నుంచే భారీ రెస్పాన్స్‌తో దూసుకెళ్లింది. విడుదలైన 28 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 310 కోట్లకి పైగా వసూళ్లు సాధించి, మరోసారి పవన్ కళ్యాణ్ స్టామినాను చాటిచెప్పింది. మొదటి రోజు కలెక్షన్లే రూ. 154 కోట్లు రావడం విశేషం.
ఈ సినిమాను DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య DVV నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. అలాగే నేహా శెట్టి, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, హరిష్ ఉతమన్, సుధేవ్ నాయర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర పాత్ర చాలా గంభీరంగా, పవర్ ఫుల్ గా ఉండటంతో అభిమానులు ఫిదా అయ్యారు. సుజీత్ స్టైల్ డైరెక్షన్, గ్రాండ్ యాక్షన్ ఎపిసోడ్స్, పవన్ డైలాగ్ డెలివరీ సినిమాను హైలైట్ చేసాయి. కథనంలో థ్రిల్, ఎమోషన్ కలిపి ప్రేక్షకులను మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేసింది.
నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ఈ సినిమాకు భారీ డీల్ కట్టబెట్టింది. ఇప్పుడు అదే క్రేజ్‌ను ఓటీటీ లోనూ కొనసాగించేందుకు సిద్ధమైంది OG. తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా OG స్ట్రీమింగ్ కానుంది.
Also Read: రీ-రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంట్రా..? "బాహుబలి: ది ఎపిక్" పెద్ద ప్లానే ..!
థియేటర్‌లో మిస్ అయినవారు లేదా మళ్లీ చూడాలనుకునేవారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఇక డేట్ వచ్చేసి అక్టోబర్ 23 నుంచి పవన్ కళ్యాణ్ OG మాస్ మ్యానియా ఓటీటీ తలుపుల తెరవనుంది.