Odela 2 Release: సూపర్ హిట్ నేచురల్ థ్రిల్లర్ 'ఓదెల' ఫ్రాంచైజీ 'ఓదెల2' పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో స్టార్ హీరోయిన్ తమన్నా 'నాగసాధువుగా' ప్రధాన పాత్రలో నటిస్తుండడంతో మరింత బజ్ నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ను ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ ప్రియులు.
Also Read:AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!
ఓదెల 2 రిలీజ్..
ఈ క్రమంలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. "అనుభూతి చెందాల్సిన పాత్ర'' అనే క్యాప్షన్ తో రక్తంతో తడిసిపోయిన తమన్నా పోస్టర్ ని షేర్ చేశారు.
A PRESENCE TO BE FELT. #Odela2 on April 17th. 🙏@iamsampathnandi@dimadhu @alle_ashok_teja @ihebahp@imsimhaa @b_ajaneesh @soundar16@neeta_lulla@madhucreations9pic.twitter.com/ihUozJX6Rt
— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 22, 2025
అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఓదెల అనే ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా 2022 లో విడుదలైన ఓదెల పార్ట్ 1 సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ఓదెల 2 తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా, వశిష్ట ఎన్. సింహా, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఎలా కాపాడారు? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది.
Also Read: MEDSRX Formula: ఈ 6 పనులు చేస్తే మీకు క్యాన్సర్ అస్సలే రాదు.. ఆ పనుల లిస్ట్ ఇదే!