/rtv/media/media_files/2025/09/29/war-2-ott-2025-09-29-12-12-22.jpg)
WAR 2 OTT
WAR 2 OTT: జూనియర్ ఎన్టీఆర్(NTR) తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సినిమా వార్ 2 ఇటీవల థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 300 కోట్లకుపైగా వసూలు చేసి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో..
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, వార్ 2 స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ చేతుల్లో ఉన్నట్లు సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ చిత్రం 2025 అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం హిందీ, తెలుగు సహా ఇతర భాషల్లో స్ట్రీమింగ్‌కి రావొచ్చని అంటున్నారు.
ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లతో పాటు కియారా అద్వానీ, అశుతోష్ రానా, అనిల్ కపూర్, అరీస్టా మెహతా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సంగీతాన్ని ప్రీతమ్, సంచిత్ బాలహారా, అంకిత్ బాలహారా అందించారు.
Also Read: తెలుగులో మాట్లాడు..? కాంతార హీరోపై నెటిజన్స్ ఫైర్
వార్ 2 యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్‌లో రూపొందిన స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన సినిమా. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, పవర్‌ఫుల్ మ్యూజిక్, స్టార్ స్టడెడ్ కాస్ట్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Also Read: అక్కడ రికార్డు బ్రేక్.. దుమ్ము రేపుతోన్న 'మిరాయ్' కలెక్షన్స్
మొత్తానికి, థియేటర్లలో మంచి ఓపెనింగ్ తీసుకున్న వార్ 2, ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకురావడానికి సిద్ధంగా ఉంది. అయితే నిజంగా అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కి వస్తుందా లేదా అన్నది అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే. వార్ 2 సినిమాను థియేటర్ లో మిస్ అయినవారు, ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు!