ప్రశాంత్ నీల్ మూవీపై అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్‌ ‘దేవర’ ప్రమోషన్స్‌లో ..' NTR31' షూటింగ్‌ అప్‌డేట్‌ను పంచుకున్నారు.' ప్రశాంత్‌నీల్‌ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌ 21 నుంచి ప్రారంభమవుతుంది. తొలి షెడ్యూల్‌ 40 రోజులు జరుగుతుంది. నేను జనవరిలో ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాను' అని తెలిపారు.

NTR31
New Update

టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'KGF' మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'NTR31' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

జనవరి నుంచి..

ఇలాంటి తరుణంలో  తాజాగా ‘దేవర’ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్‌ ఈ సినిమా గురించి మాట్లాడారు. దీని షూటింగ్‌ అప్‌డేట్‌ను పంచుకున్నారు. 'ప్రశాంత్‌నీల్‌ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌ 21 నుంచి స్టార్ట్ అవుతుంది. తొలి షెడ్యూల్‌ 40 రోజులు జరుగుతుంది. అందులో నేను పాల్గొనను. ఇతర నటీనటులకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తారు. నేను జనవరిలో ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాను' అని తెలిపారు.

Also Read : ఆ ప్రశ్నలు నన్ను అడగవద్దని చెప్పానుగా.. రిపోర్టర్ పై రజినీకాంత్ ఆగ్రహం

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.ఇక 'దేవర' విషయానికొస్తే.. 'జనతా గ్యారేజ్' లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. 

యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ డ్యూయల్ రోల్ లో నటించారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి అడుగు పెడుతుంది. సైఫ్‌ అలీఖాన్‌ విలన్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది.

#ntr31 #ntr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe