ఆ ప్రశ్నలు నన్ను అడగవద్దని చెప్పానుగా.. రిపోర్టర్ పై రజినీకాంత్ ఆగ్రహం కోలీవుడ్ సీనియర్ హీరో రజినీకాంత్ ఓ రిపోర్టర్ పైమండి పడ్డారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన్ని తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ఓ విలేకరి ప్రశ్నించాడు. దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన.. తనను అలాంటి ప్రశ్నలు అడగొద్దని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. By Anil Kumar 20 Sep 2024 in సినిమా Short News New Update షేర్ చేయండి Rajinikanth : కోలీవుడ్ సీనియర్ హీరో రజినీకాంత్ ఓ రిపోర్టర్ పైమండి పడ్డారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన్ని తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ఓ విలేకరి ప్రశ్నించాడు. దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన.. తనను అలాంటి ప్రశ్నలు అడగొద్దని అన్నారు. వివరాల్లోకి వెళ్తే.. రజినీకాంత్ తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగా ఓ విలేకరి.. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని అడగ్గా.." రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు నన్ను అడగవద్దు అని చెప్పానుగా" అని అసహనం వ్యక్తంచేస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు. Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'దేవర' స్పెషల్ షోలకు అనుమతి ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్.. తన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి పగ్గాలు అప్పగిస్తారని అధికార డీఎంకేలో కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇటీవల ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ.. 'ఇది పూర్తిగా ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం. ఆయన మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయం' అని చెప్పారు. కాగా ఇదే విషయం గురించి రజినీకాంత్ ను విలేకరి అడిగితే అతనిపై ఫైర్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన వెట్టయాన్, కూలీ సినిమాలు చేస్తున్నారు. వీటిలో 'వెట్టయాన్' దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది. జై భీం మూవీ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. #rajinikanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి