విదేశీ గడ్డపై 'దేవర' దూకుడు.. విడుదలకు ముందే దుమ్ములేపుతున్న జూనియర్! విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న 'దేవర'.. తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్ షోలను ప్రదర్శించనున్న తొలి ఇండియన్ సినిమాగా 'దేవర' నిలిచింది. By Archana 26 Sep 2024 in సినిమా Short News New Update Devara షేర్ చేయండి Devara: విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న 'దేవర'.. తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్ షోలను ప్రదర్శించనున్న తొలి ఇండియన్ సినిమాగా 'దేవర' నిలిచింది. ఈ చిత్రం రేపు వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇక రిలీజ్ కు రికార్డులు సృష్టిస్తున్న దేవర.. ఇప్పటికే ఓవర్ సీస్ లో అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు సొంతం చేసుకోగా.. తాజాగా మరో ఘనత సాధించింది. అత్యధిక డాల్బీ అట్‌మోస్ షోలు 'దేవర' న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్ షోలను ప్రదర్శించనున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా ‘దేవర’ నిలిచింది. న్యూజిలాండ్‌లో 3 స్క్రీన్స్ లో, ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్ లో ఈ మూవీ విడుదల కానుంది. డాల్బీ అట్‌మోస్ షో అంటే ఏంటి..? డాల్బీ అట్‌మోస్ ఫీచర్ 3D నాణ్యత, గొప్ప సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. డాల్బీ అట్‌మోస్ షోస్ లో పిక్చర్ క్వాలిటీ, మ్యూజిక్, సౌండ్ సాధారణ దానికంటే ఎక్కువ అనుభూతిని అందిస్తాయి. హౌస్ ఆఫ్ ది డ్రాగన్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి చిత్రాలు డాల్బీ అట్‌మోస్ ఫీచర్ తో ప్రదశించబడ్డాయి. యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ బ్యానర్స్ పై రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్ గా పవర్ పాత్రను పోషించారు. జాన్వీ, సైఫ్ ఇద్దరికీ తెలుగులో 'దేవర' తొలి చిత్రం కానుంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. Also Read: రేప్ కేసు విషయంలో ఏం జరిగిందో చెప్పిన హర్ష సాయి..! #cinema-news #devara #ntr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి