Devara: 'దేవర' కలెక్షన్ల మోత.. సెకండ్ డే కలెక్షన్స్ ఎంతంటే..!

ఎన్టీఆర్ 'దేవర' బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను నమోదు చేస్తోంది. తొలిరేజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల వసూళ్లును సాధించింది. రెండవ రోజు ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 40 కోట్ల వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Devara NTR

devara day 2 collections

New Update

Devara Day 2 Collections:  జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ 'దేవర' బాక్స్ ఆఫీస్ రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది. సుమారు రూ. 195 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో అడుగుపెట్టిన ఈ చిత్రం.. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 172 కోట్లతో  రికార్డు వసూళ్లను నమోదు చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 82 కోట్ల రూపాయల గ్రాస్,  , కర్ణాటకలో రూ.  12 కోట్లు, తమిళనాడులో రూ.  2.5 కోట్ల,  కేరళలో రూ. 60 లక్షలు, ఉత్తరాది రాష్ట్రాల్లో రూ. 10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 49 కోట్ల వసూళ్లు రాబట్టింది. 

దేవర డే 2 కలెక్షన్స్

ఇక దేవర రెండవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం.. రెండవ రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 'దేవర' రూ. 50కోట్ల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.  తెలుగు రాష్ట్రాల్లో రూ. 29 కోట్లు, హిందీలో రూ. 9 కోట్లు, తమిళనాడులో రూ. కోటి వసూళ్లు చేసినట్లు అంచనా. ట్రేడ్ నిపుణుల అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్స్ రూ. 100కోట్ల వరకు ఉంటాయి. దీంతో 'దేవర' రెండు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లో చేరనున్నట్లు  తెలుస్తోంది. 

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా పవర్ ఫుల్ రోల్ లో పోషించారు. జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ గా నటించింది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శ్రుతి మరాఠే, షైన్ టామ్ చాకో, నారాయణ్, కలైయరసన్, మురళీ శర్మ, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఈ సినిమాకు మరింత హైలైట్ గా నిలిచింది. 

డే 1 కలెక్షన్స్ 

నైజాం-21.55 కోట్లు
సీడెడ్-10.12 కోట్లు
ఉత్తరాంధ్ర-6.04 కోట్లు
ఈస్ట్-4.40 కోట్లు
వెస్ట్-3.96 కోట్లు
గుంటూరు-6.75 కోట్లు
కృష్ణా-3.38 కోట్లు
నెల్లూరు-2.15 కోట్లు
ఏపీ + తెలంగాణ-(టోటల్)58.35 కోట్లు
కర్ణాటక-6.9 కోట్లు
తమిళనాడు-0.68 కోట్లు
కేరళ-0.09 కోట్లు
నార్త్-4.68 కోట్లు
ఓవర్సీస్-20 కోట్లు

Also Read: Devara OTT: భారీ ధరకు 'దేవర' ఓటీటీ హక్కులు..! తెలిస్తే షాకే!

#koratala-siva #devara #jr-ntr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి