Devara OTT: భారీ ధరకు 'దేవర' ఓటీటీ హక్కులు..! తెలిస్తే షాకే! ఎన్టీఆర్ 'దేవర' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ. 100 కోట్లకు పైగా కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేట్రికల్ రన్ తర్వాత 'దేవర' నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. By Archana 12 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update devara ott షేర్ చేయండి Devara OTT: 2024 రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లో ఎన్టీఆర్ 'దేవర' ఒకటి. కొరటాల శివ- తారక్ కాంబినేషన్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన 'దేవర' ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశాయి. 24 గంటల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్ తో దేవర ట్రైలర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు చేస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో దేవర డిజిటల్ రైట్స్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. దేవర డిజిటల్ రైట్స్ దేవర డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 100 కోట్లకు పైగా కొనుగోలు చేసినట్లు సమాచార. ఇటీవలే కాలంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కొనుగోలు చేసిన సౌత్ ఇండియన్ సినిమాల్లో ఇదే అత్యధికం. థియేట్రికల్ రన్ తర్వాత 'దేవర' నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ట్రైలర్ లో తారక్ భారీ యాక్షన్ సీక్వెన్సెస్, డైలాగ్స్, VFX సినిమా పై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. యువసుదా ఆర్ట్స్, ఎన్టీఆర్ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ నటి జాన్వీ, సైఫ్ అలీఖాన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శ్రుతి మరాఠే, షైన్ టామ్ చాకో, నారాయణ్, కలైయరసన్, మురళీ శర్మ, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి