టాలీవుడ్ సినీనటుడు, కమెడియన్ ఆలీకి నోటీసులు అందాయి. ఆయన అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట(మం) ఎమ్మిడికాయ పంచాయతీ పరిధిలో సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ ఫామ్ హౌజ్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ సెక్రెటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలకు ఈ నెల 5న ఒక నోటీసు ఇవ్వగా.. ఆ నోటీసుకు అలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ నెల 22న మరో నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా అలీ తోపాటూ ఫామ్‌హౌస్‌లో పని చేసే వారికి సైతం ఈ నోటీసులు అందింనట్లు సమాచారం.
Also Read : వాళ్లకు AR రెహమాన్ టీమ్ లీగల్ నోటీసులు.. అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ?
నోటీసు ప్రకారం మూడు రోజుల్లో నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి. దానికి సంబంధించిన పత్రాలు గ్రామ పంచాయతీలో ఇవ్వాలని తెలిపారు. కాగా, ఈ నోటీసులపై తన తరఫు లాయర్ ద్వారా జవాబు చెప్పేందుకు అలీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొందరు తనపై కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఇలా నోటీసులు పంపారని అలీ ఆరోపిస్తున్నారట.
Also Read : సుకుమార్ నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవి.. హీరో ఎవరంటే?