Madraskaaran ott: ఓటీటీలో మెగా డాటర్ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నిహారిక నటించిన లేటెస్ట్ మూవీ 'మద్రాస్‌కారన్‌' తెలుగు ఓటీటీ వెర్షన్ వచ్చేసింది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం నేటి నుంచి తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ 'ఆహా' పోస్టర్ రిలీజ్ చేసింది.

New Update

Madraskaaran OTT:  మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం ఓవైపు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూనే మరోవైపు యాక్టింగ్ కూడా చేస్తోంది. గతేడాది నిహారిక కథానాయికగా విడుదలైన తమిళ్ ఫిల్మ్  'మద్రాస్‌కారన్‌' తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. ఇప్పటి వరకు తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈరోజు నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'ఆహా' పోస్టర్ రిలీజ్ చేసింది.  

Also Read: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో

మూవీ స్టోరీ ఏంటి?  

వాలి మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో షేన్‌ నిగమ్‌, నిహారిక హీరో హీరోయిన్లుగా నటించారు. కలైయరసన్,  ఐశ్వర్య దత్తా, కరుణాస్, పాండియరాజన్, సూపర్ సుబ్బరాయన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రైతుగా మారిన ఇంజనీర్ సత్య (షేన్‌ నిగమ్‌) కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే బాగా చదువుకొని ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించిన సత్య కొన్ని కారణాలతో  ఒక రైతుగా మారతాడు. ఆ తర్వాత భార్య మీరా( నిహారిక) తండ్రితో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. ఈ క్రమంలో కొందరు దుండగులు సత్య పై దాడి చేస్తారు. తనపై దాడి వెనుక తన శత్రువు సింగమ్‌ ఉన్నాడని అనుమానపడతాడు సత్య. అసలు సింగం ఎవరు? వీరిద్దరి మధ్య గతంలో ఏం జరిగింది? సింగం నుంచి సత్య తన కుటుంబాన్ని  ఎలా కాపాడుకున్నాడు? అనేది సినిమా స్టోరీ. 

Also Read: Prabhu Deva son: కొడుకును అదిరిపోయేలా ఇంట్రడ్యూస్ చేసిన ప్రభుదేవ.. డాన్స్ వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు