మెగా డాటర్ నిహారిక విడాకుల తర్వాత సినిమాల పరంగా తన సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా సొంతం ప్రొడక్షన్ హౌస్ స్థాపించి.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్ గా దూసుకెళ్తోంది. ఇటీవలే 'కమిటీ కుర్రాళ్ళు' సినిమాతో ప్రొడ్యూసర్ గా సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు హీరోయిన్ గానూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం నిహారిక తమిళంలో 'మద్రాస్ కారన్' అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో నిహారిక ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరీ మలయాళ హీరో షేన్ నిగమ్ తో రొమాన్స్ చేసింది. Also Read : తగ్గనున్న 'పుష్ప2' టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచంటే? మెగా ఫ్యాన్స్ షాక్.. సాంగ్ లో వీళ్లిద్దరి కెమిస్ట్రీ కూడా అదిరిపోయిందని చెప్పాలి. నిహారిక తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ రేంజ్ రొమాన్స్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. అందుకే ఇప్పుడు వచ్చిన వీడియో సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. అటు నెటిజన్స్ ఈ వీడియోను చూసి సాంగ్ లోనే ఇంత రొమాన్స్ చేసిందంటే, ఇక సినిమాలో ఇంకెంత రొమాన్స్ చేసిందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా 'మద్రాస్ కారన్' సినిమాతో నిహారిక కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. వాలి మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ఎస్ ఆర్ ప్రొడక్షన్స్ పై జగదీశ్ నిర్మిస్తున్నారు. Also Read : 'పుష్ప2' గంగమ్మ తల్లీ జాతర సీన్.. థియేటర్ లో పూనకాలతో ఊగిపోయిన మహిళ