Niharika Konidela: సొంత బ్యానర్ లో మెగా డాటర్ మరో మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

నిహారిక తన సొంత బ్యానర్ 'పింక్ ఎలిఫేంట్స్' పై మరో సినిమాకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ మానస దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే నిహారిక తన బ్యానర్లో 'కమిటీ కుర్రాళ్ళు' నిర్మించి సూపర్ హిట్ అందుకుంది.

New Update
mega daughter niharika

mega daughter niharika

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గా రాణిస్తోంది. 'పింక్ ఎలిఫాంట్స్' పేరుతో సొంత ప్రొడక్షన్ కంపెనీ స్టార్ చేసిన నిహారిక మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తోంది. ఇప్పటికే నిహారిక నిర్మించిన తొలి ఫీచర్ ఫిల్మ్ 'కమిటీ కుర్రాళ్ళు' సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.  అతితక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. 

మరో సినిమాకు శ్రీకారం 

అయితే తాజాగా నిహారిక తన బ్యానర్ లో మరో సినిమాకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి  డెబ్యూ డైరెక్టర్ మానస దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. మానస గతంలో నిహారిక నిర్మించిన వెబ్ సీరీస్ లకు క్రియేటివ్ డైరెక్టర్ గా పనిచేసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం. 

'విశ్వంభర' లో స్పెషల్ రోల్  

ఇది ఇలా ఉంటే నిహారిక మెగాస్టార్  'విశ్వంభర' చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవలే నిహారిక, సాయి ధరమ్ తేజ్ సాంగ్ షూట్ లో కూడా పాల్గొన్నట్లు సమాచారం. యాంకర్ గా కెరీర్ స్టార్ చేసిన నిహారిక.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా రెండు, మూడు చిత్రాలు చేసిన తర్వాత.. మళ్ళీ వెబ్ సీరీస్ లలో నటించింది. ఇప్పుడు నిర్మాతగా మారింది. ఇటీవలే నిహారిక ప్రొడ్యూస్ చేసిన 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రం సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. తక్కువ బడ్జెట్ తో భారీ వసూళ్లను రాబట్టింది. నిహారిక రీసెంట్ గా 'మద్రాస్ కరణ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది జనవరిలో ఈ చిత్రం విడుదలైంది. 

Also Read: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు