Nayanthara: చిరుకు చుక్కలు చూపిస్తున్న నయనతార.. వామ్మో! 'వర ప్రసాద్' సినిమాకు ఇన్ని కండిషన్లా?

సినిమా షూటింగ్ అంటే కేవలం హీరోహీరోయిన్ల  రెమ్యునరేషన్స్ మాత్రమే కాదు వారి ప్రయాణ ఖర్చులు, వారు స్టే చేయడానికి అవసరమయ్యే వసతులతో పాటు వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతే భరించాల్సి ఉంటుంది.

New Update
Nayantara

Nayantara

Nayanthara:  సినిమా షూటింగ్ అంటే కేవలం హీరోహీరోయిన్ల  రెమ్యునరేషన్స్ మాత్రమే కాదు వారి ప్రయాణ ఖర్చులు, వారు స్టే చేయడానికి అవసరమయ్యే వసతులతో పాటు వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతే భరించాల్సి ఉంటుంది.  ఒక్కొక్క హీరోయిన్ దగ్గర 5-10 మంది వరకు స్టాఫ్ ఉంటారట. మేకప్ కోసం ఒకరు, హెయిర్ స్టైలింగ్ కోసం ఒకరు, పర్సనల్ వర్క్స్ కోసం ఒకరు, బౌన్సర్లు.. ఇలా వీరందరి ఖర్చులు నిర్మాతలే భరించాలి. అయితే ఇవన్నీ కూడా అగ్రిమెంట్ లో భాగంగానే ఉంటాయి. హీరో హీరోయిన్లు తమ కండీషన్స్, రిక్వైర్మెంట్స్ నిర్మాతలు ఒప్పుకున్న తర్వాతే ప్రాజెక్ట్ సైన్ చేయడం జరుగుతుంది. ఇక కొన్ని సందర్భాల్లో వాళ్ళ కండీషన్స్ ఎక్కువని అనిపించినా తప్పక ఒప్పుకుంటుంటారు నిర్మాతలు. ముఖ్యంగా స్టార్ హీరోహీరోయిన్లను కాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ కాస్త ఎక్కువే ఉంటాయి. 

నయన్ కండీషన్స్.. 

ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలో ఇదే జరిగిందని అనుకుంటున్నారు నెటిజన్లు. మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న  'మన శంకర వరప్రసాద్' సినిమాలో నయన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఒకే చేసేముందు ముందు భారీగానే కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే సినిమాలోని ఓ సాంగ్ షూట్ కోసం నయనతార  హైదరాబాద్ రాగా .. ఆమెతో పాటు ఆమె ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి ఇద్దరు కేర్‌టేకర్లు, ఆమె కోసం ఇంకో నలుగురు అసిస్టెంట్లు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవడంతో.. ఇది చూసిన నెటిజన్స్  హీరోయిన్ తో పాటు వీరందరి ఖర్చులు  కూడా నిర్మాతలే  భరించాల్సి ఉంటుందని అనుకుంటున్నారు. ఇది  భారమే అయినప్పటికీ.. ఈ కండీషన్స్ కి నిర్మాతలు  ముందే ఒప్పుకున్నారని టాక్.  ప్రస్తుతం నయన్  పిల్లలు చిన్నగా ఉండడంతో వారి బాగోగులు ఆమె చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే  పలు కండీషన్స్ తో ఆమె ఈ ప్రాజెక్ట్ ఒకే చేశారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని  చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

Also Read: Venice Film Festival Awards: ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. వెనీస్ వేదికపై చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి! ఎవరీ అనుపర్ణ రాయ్

Advertisment
తాజా కథనాలు