/rtv/media/media_files/2025/09/12/anuparna-roy-2025-09-12-16-19-01.jpg)
Anuparna Roy
ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి అడుపెట్టిన దర్శకురాలు అనుపర్ణ రాయ్ తొలి ప్రయత్నంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 'Songs of Forgotten Trees' చిత్రంతో అంతర్జాతీయ వేదిక పై అడుగుపెట్టింది. ప్రతిష్టాత్మక వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ఒరిజోంటి విభాగంలో 'బెస్ట్ డైరెక్టర్' అవార్డును గెలుచుకున్నారు. ఒరిజోంటి విభాగంలో ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకురాలుగా అనుపర్ణ చరిత్ర సృష్టించారు. దీంతో ఈమె పేరు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆమె బ్యాక్ గ్రౌండ్, సినిమాల గురించి గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుపర్ణ రాయ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఐటీ ఉద్యోగం వదిలి..
బెంగాల్ లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన అనుపర్ణ రాయ్ ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. దీంతో ఆమె తల్లిదండ్రులకు సినిమాలంటే పెద్దగా అవగాహనా, ఇంట్రెస్ట్ ఉండేది కాదట. కానీ అనుపర్ణకు మాత్రం సినిమాలంటే బాగా ఇష్టం ఉండేదట. ఆ తర్వాత ఐటీ జాబ్ చేస్తున్న సమయంలో ఆమెకు సినిమాలపై మరింత ఆసక్తి పెరిగిందట. దీంతో 2020లో తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా సినిమా డైరెక్షన్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారట అనుపర్ణ. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యారు.
"It is a responsibility to think for a moment and stand beside Palestine. I might upset my country but it doesn't matter anymore," says Indian filmmaker Anuparna Roy after winning Best Director award in the Orizzonti section at Venice Film Festival. pic.twitter.com/u3CJLxKQhK
— Mohammed Zubair (@zoo_bear) September 8, 2025
అయితే మొదట ఆమె తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోలేదట. కూతురు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆశపడేవారు. అయినప్పటికీ అనుపర్ణ తన పట్టు వదలకుండా తన నిబద్దత, పట్టుదలతో సినిమా డైరెక్షన్ పై సామర్థ్యం పెంచుకున్నారు. తాను అనుకున్నట్లుగానే తన తొలి చిత్రం 'సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్' తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 31 ఏళ్లకే అంతర్జాతీయ వేదికపై అవార్డు అందుకొని సత్తా చాటారు. ముంబైలో నివసించే ఇద్దరు వలస మహిళల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు అనురాగ్ కశ్యప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
Also Read: MIRAI VFX: కార్తిక్ ఘట్టమనేని టెక్నికల్ బ్రిలియన్స్ అరాచకం ..ఈ విజువల్స్ చూస్తే గూస్ బంప్స్ అంతే!