Nayantara: #మెగా 157 అంటూ మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చక చక జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు నుంచి మరో కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమాలో ఫీమేల్ లీడ్ ని పరిచయం చేశారు.
నయనతార ఆన్ బోర్డు
ఈ చిత్రంలో మెగాస్టార్ జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనున్నట్లు ప్రకటించారు. ఎప్పటిలాగే డైరెక్టర్ అనిల్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో కాన్సెప్ట్ తో హీరోయిన్ కి వెల్కమ్ చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో చివరిలో మెగాస్టార్ మేనరిజంలో ‘‘హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా ' అంటూ నయన్, అనిల్ సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా నయన్ ని టీమ్ లోకి స్వాగతిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. హ్యాట్రిక్ చిత్రానికి స్వాగతం! నయన్ తో కలిసి మళ్ళీ పని చేయడం సంతోషంగా ఉందని అన్నారు. గాడ్ ఫాదర్, సైరా నరసింహా రెడ్డి తరవాత నయన్- చిరు కాంబోలో రాబోతున్న మూడవ చిత్రమిది.
The ever graceful queen, #Nayanthara joins the journey of #Mega157 ❤️🔥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 17, 2025
Witness her elegance and emotion on the big screen alongside Megastar @KChiruTweets in an @AnilRavipudi Entertainer💥
— https://t.co/qwKoC3e2Fi #ChiruAnil SANKRANTHI 2026 – రఫ్ఫాడించేద్దాం 🔥 pic.twitter.com/DDTkYluNo7
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో.. మెగాస్టార్ పాత్ర ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉండబోతుంది. గ్యాంగ్‌లీడర్’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’ లో కనిపించిన చిరంజీవిని మళ్ళీ చూస్తారని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. అంతేకాదు ఇందులో మెగాస్టార్ తన ఒరిజినల్ పేరు శంకర వరప్రసాద్ పాత్రలో కనిపించబోతున్నారు.
షైన్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. 'సంక్రాంతి వస్తున్నాం' మ్యూజికల్ హిట్ తర్వాత అనిల్ - భీమ్స్ కాంబో మరోసారి రిపీట్ అవడం ఆసక్తిని పెంచుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
latest-news | cinema-news | #chiruAnil update | nayanatara | chiranjeevi | anil-ravipudi