/rtv/media/media_files/GGOmPKH1Aa1WsbxAnCsf.jpg)
టాలీవుడ్ హీరో నారా రోహిత్ తన బ్యాచిలర్ లైఫ్ గుడ్‌బై చెప్పబోతున్నాడు. ఇందులో భాగంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. తాను ప్రేమించిన సిరీ అనే అమ్మాయితో ఇవాళ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో అంగరంగ వైభవంగా తను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.
ఉదయం 10.45 గంటలకు
ఉదయం 10.45 గంటలకు శిరీష్ (సిరి) వేలికి ఉంగరాన్ని తొడిగాడు. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులతో సహా నారా, నందమూరి ఫ్యామిలీ హాజరైంది.
కాగా నారా రోహిత్ సినిమాల విషయానికొస్తే.. 2019లో బాణం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘సోలో’ అనే మూవీ చేశాడు. ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు కానీ పెద్దగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు.
ఇక ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇటీవలే మళ్లీ తన సినీ కెరీర్ ప్రారంభించాడు. ఇందులో భాగంగానే ‘ప్రతినిధి 2’ అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ చిత్రం 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లకు ముందు రిలీజ్ కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలం అయింది. కానీ ఈ మూవీలో నటించిన హీరోయిన్ను మాత్రం లైఫ్ పార్ట్నర్గా ఫిక్స్ చేసుకున్నాడు. ప్రతినిధి 2 మూవీలో నారా రోహిత్ - సిరి లెల్లా జంటగా నటించారు. ఆ సమయంలోనే ఆమెతో ప్రేమలో పడిన రోహిత్ ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో బాగంగానే ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. కాగా వీరిద్దరి పెళ్లి డిసెంబర్ 15న జరగనున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చేశారు.
The start of forever begins today💍✨ @IamRohithNara engaged to Love of his life #SireeshaLella today in a grand engagement ceremony ❤️🔥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 13, 2024
Wishing you both all the happiness as you step into this beautiful chapter together ❤️#NaraRohith pic.twitter.com/nnw6vLDFe7
Also Read : కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో నటాషా.. ఓ సరికొత్త అనుభూతి అంటూ పోస్ట్