/rtv/media/media_files/2025/03/13/mOEmKhjxLsC5WQDAujta.jpg)
Yevade Subramanyam re release
Yevade Subramanyam: టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఒకప్పటి స్టార్ హీరోల సినిమా మళ్ళీ థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు రీరిలీజై మరోసారి ట్రెండ్ సృష్టించగా... తాజాగా మరో స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ కి సిద్ధమైంది. నాని హీరోగా నాగ్అశ్విన్ దర్శకుడిగా పరిచయమైనా 'ఎవడే సుబ్రమణ్యం' సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్ళీ వెండితెరపైకి వచ్చేస్తోంది. మార్చి 21న ఈ చిత్రం రీరిలీజ్ కానున్నట్లు తెలియజేస్తూ వైజయంతి మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. 10 ఏళ్ళ తర్వాత 'దూద్ కాశీ' మళ్ళీ పిలుస్తోంది అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Recreating the timeless moment from #YevadeSubramanyam 🤩✨
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 12, 2025
Relive the journey in theatres on March 21st!@NameisNani @TheDeverakonda @nagashwin7 @riturv #MalvikaNair @radhanmusic @SwapnaDuttCh #PriyankaDutt @VyjayanthiFilms @SwapnaCinema pic.twitter.com/YmFw8DMXG3
2015లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. సెల్ఫ్ డిస్కవరీ అనే ప్రధాన అంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగశ్విన్ లోతైన ఆలోచనలు, మంచి కథాంశం ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. ఇందులో నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించారు. విజయదేవకొండకు ఈ చిత్రం నటుడిగా మంచి గుర్తింపును ఇవ్వడంతో పాటు తన కెరీర్ కి కూడా బిగ్గెస్ట్ ప్లస్ గా మారింది. మరోవైపు నానికి కూడా 'ఈగ' తర్వాత మరో హిట్ అందించింది. అలాగే దర్శకుడిగా నాగశ్విన్ కి తొలి చిత్రంతోనే ఫుల్ ఫేమ్ వచ్చింది.
ఇది కూడా చూడండి: Kartik Aaryan: కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్.. కన్ఫామ్ చేసిన హీరో తల్లి?
వైజయంతి బ్యానర్ పై ప్రియాంక దత్త్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ, మాళవిక మోహన్ ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. లెజెండ్రీ యాక్టర్ కృష్ణంరాజు, సీనియర్ నటి షావుకారి జానకి, నాజర్, రాజేశ్ వివేక్, శ్రీనివాస్ అవసరాల, పవిత్రా లోకేశ్, శివన్నారాయణ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?