HIT 3 నాని 'హిట్3' ఫీవర్ పీక్స్ కి చేరుకుంది. మరో 3 రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ సందడి మొదలైంది. ఊహించని రేంజ్ లో ఈసినిమా ప్రీ సేల్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే బుక్ మై షోలో 50K పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ అద్భుతమైన ముందస్తు అమ్మకాలు సినిమా ప్రేక్షకుల దృష్టిని ఎంతగా ఆకర్షించిందో చూపిస్తున్నాయి.
జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్
పలు నివేదికల ప్రకారం.. ఏప్రిల్ 25న, 10,070 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత ఏప్రిల్ 26న 16,070 టిక్కెట్లు, 27న 24,140 టిక్కెట్లకు పెరిగింది. మొత్తం 50వేల పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి తోడు నార్త్ అమెరికాలో కూడా ప్రీ సేల్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఓవర్ సీస్ లో ఈ సినిమా ప్రీ సేల్ బిజినెస్ $225Kకి చేరుకుంది. దీంతో దేశీయ, అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద హిట్ 3 తన ఆధిపత్యం కొనసాగించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం అవుతోంది.
Advance bookings for #HIT3 have opened in a few areas and the film has already sold 50K+ tickets on BookMyShow, three days ahead of release. #Nani’s brand power among the audience is once again clearly visible with HIT 3. pic.twitter.com/PNnrwern1L
— Telugu Chitraalu (@TeluguChitraalu) April 28, 2025
ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ
శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. ఇందులో నాని జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.
telugu-news | latest-news | cinema-news