/rtv/media/media_files/2025/08/04/coolie-pre-release-event-2025-08-04-16-17-54.jpg)
Coolie Pre Release Event
Coolie Pre Release Event: సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ’(Coolie Movie), మోరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 14న విడుదల కానుంది. విడుదలకు ముందు హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్, ఇందులో హీరో నాగార్జున, దర్శకుడు లోకేశ్, నటులు సత్యరాజ్, శ్రుతి హాసన్ తదితరులు హాజరయ్యారు.
Also Read: రజినీకాంత్ కాళ్ల పై అమీర్ ఖాన్ ఎలా పడిపోయాడో చూడండి! వీడియో వైరల్!
ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. (Nagarjuna Speech In Coolie Event)
అయితే ఈవెంట్‌లో నాగార్జున తన పాత్ర ‘సైమన్’ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘అన్నమయ్య’ లాంటి గొప్ప పాత్ర చేసిన తర్వాత ప్రయోగాత్మక పాత్రలు చేయాలనిపించేది. లోకేశ్ కనగరాజ్ నన్ను కలిసి ‘విలన్ పాత్రలో చేస్తారా? అని అడిగారు. లేకపోతే కాసేపు టీ తాగి వెళ్తాను’ అన్నారు. నేను అయితే చాలా రోజులుగా ఆయనతో పని చేయాలని అనుకుంటున్నాను. కథ వినగానే నా పాత్ర ఓ హీరో పాత్రలా అనిపించింది. అందుకే రజనీ సర్ ఈ కథ ఒప్పుకున్నారా అని కూడా అడిగాను,’’ అని చెప్పారు నాగార్జున.
#RajiniKanth గారు ఈ కథని ఎలా ఒప్పుకున్నారు అని అడిగాను- #Nagarjuna#Coolie#TeluguFilmNagarpic.twitter.com/z8JB0JaYvS
— Telugu FilmNagar (@telugufilmnagar) August 4, 2025
సైమన్ పాత్రలో నటించడంపై నాగార్జున చెప్పిన విధంగా, కథలో కొన్ని మార్పులు చేసి లోకేష్ ఇంకా మంచిగా కథను డెవలప్ చేశారట. ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. ‘‘ఇన్నేళ్ల కెరీర్‌లో మొదటిసారి కథను రికార్డ్ చేసి ఇంట్లో మళ్లీ మళ్లీ విన్నాను. లోకేశ్ డెవలప్ చేసిన విధానం నన్ను ఆకట్టుకుంది,’’ అన్నారు.
Also Read: 'A' రేటింగ్‌తో కు..కు..కు.. కూలీ పవర్ హౌసే... ఆగస్ట్ 14 అస్సలు తగ్గేదేలే!
షూటింగ్ అనుభవం గురించి మాట్లాడుతూ, ‘‘వైజాగ్‌లో మొదటి షెడ్యూల్ జరిగింది. రెండో రోజు షూటింగ్ వీడియో లీక్ అయ్యి వైరల్ కావడంతో, అంతా నిరాశ పడ్డాం. అయితే ఆ సీన్ చిత్రీకరణ చూసి నేను లోకేష్ ని మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా? అని అడిగాను. సైమన్ పాత్ర అంత క్రూరంగా ఉంటుంది. లోకేశ్ సెట్లో చాలా కూల్‌గా ఉంటారు. బడ్జెట్ మించకుండా రూ.5 కోట్లు మిగిల్చి సినిమా పూర్తి చేశారు,’’ అని తెలిపారు.
రజనీకాంత్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, ‘‘ఆయన పక్కన కూర్చోనడమే ఒక గొప్ప అనుభవం. డైలాగ్ రిహార్సల్స్ కూడా ఆయన ఎప్పటికప్పుడు చేస్తారు. థాయ్‌లాండ్‌లో 17 రోజుల పాటు చేసిన నైట్ షూటింగ్, యాక్షన్ సన్నివేశాలు మరచిపోలేను. షూటింగ్ చివరి రోజు తలైవా ప్రతి ఒక్కరికీ గిఫ్ట్ అందించారు’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి మాట్లాడుతూ 'ఇటీవల అనిరుధ్ వరుస బాక్స్ ఆఫీస్ హిట్‌లు కొడుతున్నాడు. ‘కూలీ’లో ఆయన మ్యూజిక్ కూడా సెన్సేషన్ అవుతుంది’’ అన్నారు. అంతేకాక, విలన్ పాత్ర చేయడం సులభమా? అనే ప్రశ్నకు నవ్వుతూ, ‘‘ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు కాబట్టి విలన్ పాత్రే చాలా ఈజీ’’ అని అన్నారు నాగార్జున. చివరగా తన గత సినిమాల పేర్లతో పోల్చుతూ, రజనీకాంత్ - డాన్, శ్రుతిహాసన్ - గీతాంజలి, లోకేశ్ - సూపర్, తాను - కిల్లర్ అని సరదాగా చెప్పుకొచ్చారు.