Aamir Khan Viral Video: రజినీకాంత్ కాళ్ల పై అమీర్ ఖాన్ ఎలా పడిపోయాడో చూడండి! వీడియో వైరల్!

'కూలీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అమీర్ ఖాన్.. రజినీకాంత్ ని రాగానే కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update

Aamir Khan Viral Video: కొంతమంది హీరోలు ఎంత ఎదిగిన.. ఒదిగి ఉంటారు. అమీర్ ఖాన్ కూడా అలాంటి వారేనని ఈ వీడియోతో అర్థమవుతోంది. అయితే నిన్న చెన్నైలో జరిగిన 'కూలీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరైన అమీర్ ఖాన్.. రజినీకాంత్ ని రాగానే కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ అమీర్..  రజినీ వయసు, అనుభవానికి మర్యాదిస్తూ అతడి కాళ్లకు నమస్కరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రజినీ రాగానే ఆడిటోరియం అంతా అరుపులు, కేకలతో మార్మోగింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్,  సత్యరాజ్, ఉపేంద్ర  అనిరుధ్, డైరెక్టర్ లోకేష్ నిర్మాత కళానిధి మారన్, కావ్య మారన్ ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. 

ట్రెండింగ్ లో 'కూలీ' ట్రైలర్ 

ఇదిలా 'కూలీ'  ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అనిరుధ్ బీజీఎమ్, లోకేష్ యాక్షన్ మార్క్, రజినీ కాంత్ స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిస్తున్నాయి. విడుదలైన 24 గంటల్లో 3 మిలియన్ పైగా వ్యూస్ తో దుమ్ము దులుపుతోంది ట్రైలర్. అమీర్ ఖాన్,  నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్ కాస్ట్ ప్రజెన్స్ తో ట్రైలర్ మరో రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇందులో నాగ్ ఇప్పటివరకు కనిపించని ఒక భిన్నమైన రోల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ట్రైలర్ లో నాగార్జున లుక్, ఆయనకు సంబంధించిన సన్నివేశాలు ఆడియన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. వీటన్నింటికి మించి ఒంటినిండా టాటూలతో అమీర్ ఖాన్ ఎంట్రీ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది.   

ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా 'కూలీ' టైటిల్ సాంగ్, ఐటమ్ నెంబర్ 'మోనికా' సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేశాయి. మిలియన్ల వ్యూస్ తో ఫుల్ ట్రెండ్ అయ్యాయి. ఇందులో పూజ హెగ్డే, సౌబిన్ షాహిర్ ఎనర్జిటిక్ స్టెప్పులతో దుమ్ములేపారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే అనిరుధ్ రజనీ 'జైలర్' సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించగా.. ఇప్పుడు 'కూలీ' తో మరోసారి తన మార్క్ చూపించబోతున్నాడు.  

హై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రజినీతో పాటు చాలా మంది స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషించారు. నాగార్జున, అమీర్ ఖాన్, రియల్ స్టార్ ఉపేంద్ర, సత్య రాజ్, శృతి హాసన్, అర్జున్ దాస్ తదితరులు నటించారు. 'కూలీ' ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమిళ్ తో పాటు  హిందీ, మలయాళం , కన్నడ భాషల్లో రానుంది. 'జైలర్' తర్వాత ఆ రేంజ్ అంచనాలతో వస్తున్న 'కూలీ'  కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆకస్తిగా ఎదురుచూస్తున్నారు. 

Also Read: Friendship Day Special 2025: 'దోస్త్ మేరా దోస్త్' అంటూ ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన సినిమాలివే! మీరు చూశారా

Advertisment
తాజా కథనాలు