నాగ చైతన్య - సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో నాగార్జున ఆమెపై క్రిమినల్ కేసుతోపాటు, పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా నేడు నాంపల్లి కోర్టుకు నాగార్జున, అమల, నాగచైతన్యతోపాటు సుప్రి, వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ మేరకు కోర్టు నాగార్జున స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు సమాచారం.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.." సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగం తో పాటు సామజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నాం. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారు.
Also Read : దేవర' లో మీరు చూసింది 10 శాతమే.. అసలు కథ పార్ట్2 లోనే : కొరటాల శివ
క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..
అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని కూడా అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశ్యం తోనే మంత్రి ఇలాంటి వాఖ్యలు చేసింది. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని టెలివిజన్ ఛానెల్స్ లో ప్రసారం చేసాయి. అన్ని పేపర్స్ ప్రచురితం చేసాయి. దీంతో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మా కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది. మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.." అని కోర్టుకు నివేదించాడు.