/rtv/media/media_files/2024/11/04/7K4KHWEjB3zoDjlaQZbX.jpg)
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య - చందు మొండేటితో కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తండేల్'. శ్రీకాకుళంలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
కానీ అనివార్య కారణాల వల్ల దాన్ని సంక్రాంతికి షిఫ్ట్ చేసినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు ఉండటంతో ‘తండేల్' సినిమా రావడం కష్టమే అని డైరెక్టర్ చందూ మొండేటి ఇటీవల ఓ ఈవెంట్ లో చెప్పారు. అయితే ఎట్టకేలకు మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫైనల్ చేశారట.
Also Read : ప్రభాస్ కు జోడిగా నయనతార.. 17 ఏళ్ళ తర్వాత క్రేజీ కాంబో రిపీట్
ఫిబ్రవరి 14 న థియేటర్స్ లో..
లేటెస్ట్ ఫిలిం నగర్ టాక్ ప్రకారం.. ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి రెండో వారానికి ముందే విడుదల చేయాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారట.
Exclusive : #Thandel makers confirmed to release the film before the 2nd week of February, 2025
— Tollywood Box Office (@Tolly_BOXOFFICE) November 4, 2024
Chances to announce the release date at pressmeet on tomorrow@chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP pic.twitter.com/WVlVQA5hjp
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కావడం, ‘తండేల్'మూవీలో దేశభక్తితో పాటూ ఎమోషనల్ లవ్ స్టోరీ ఉండటంతో ఆరోజైతే సినిమాకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని మూవీ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారట మేకర్స్. నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.
Also Read : ఈ వారం ఓటీటీలో ఏకంగా 23 సినిమాలు.. ఆ నాలుగు చాలా స్పెషల్