సెల్ఫ్ ఎలిమినేట్ అయిన మణికంఠ.. 7 వారాల్లో అన్ని లక్షలు సంపాదించాడా?

'బిగ్ బాస్ సీజన్ 8' లో నాగ మణికంఠ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కాకుండా సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే హోస్ లో ఉన్న ఏడు వారాలకు గానూ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. వారానికి రూ.1.20 లక్షల చొప్పున ఏడువారాలకు రూ.8.40 లక్షలు సంపాదించినట్లు సమాచారం.

nagmani
New Update

తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యాక అసలు మజా వచ్చింది. హౌస్ లో టాస్కులతో పాటూ గొడవలు కూడా భారీగానే జరుగుతున్నాయి. ఇక నిన్నటితో సీజన్ 8 ఏడు వారాలు ముగించుకుంది. అయితే ఏడో వారంలో భాగంగా ఓ షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. హౌస్ నుంచి తనకు తానే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి నాగ మణికంఠ బయటికొచ్చేశాడు.

Also Read : దేశాలు దాటిన రామ్ చరణ్ క్రేజ్.. 'గేమ్ ఛేంజర్' సాంగ్ కు కొరియన్స్ డ్యాన్స్

అతని నుంచి ఇది అస్సలు ఊహించలేదు. ఎందుకంటే మొదట మణికంఠ హోస్ కు వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ తో బిగ్‌బాస్‌ షో నాకు ఎంత ముఖ్యమో మీకు తెలియదు, నా పెళ్లాంబిడ్డలు తిరిగి రావాలన్నా, అత్తామామ దగ్గర గౌరవం దక్కాలన్నా ఈ షో గెలవాలి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక నామినేషన్ లో తనపేరు ఉంటే తెగ టెన్షన్ పడేవాడు. కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయింది. 

Also Read : దేవిశ్రీ ప్రసాద్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ

నన్ను పంపించేయండి..

నేను హౌస్ లో ఉండలేను, నన్ను పంపించేయండి, నా హెల్త్ కూడా బాలేదు, ఉండటం నావల్ల కాదని బిగ్ బాస్ తో మొరపెట్టుకున్నాడు. అటు వీకండ్ ఎపిసోడ్ లోనూ నాగార్జునతో ఇదే మాట చెప్పాడు. హెల్త్ బాలేదని చెప్పడంతో అతన్ని డాకర్ట్స్ దగ్గరకు పంపించగా.. వాళ్ళు అంతా బానే ఉందన్నారు. 

అయినా కూడా తాను హౌస్ లో ఉండనని చెప్పడంతో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కాకుండా.. సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే హోస్ లో ఉన్న ఏడు వారాల్లో మణికంఠ బాగానే సంపాదించాడు. అతని రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. వారానికి రూ.1.20 లక్షల చొప్పున ఏడువారాలకుగానూ రూ.8.40 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది.

Also Read :  తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు ఫ్రీగా కోచింగ్!

Also Read :  ఇక్కడ 117 రోజులకు  ఒకసారి సూర్యోదయం

#tollywood #biggboss-season-8-telugu #biggboss-season-8
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe