నాగ చైతన్య–శోభిత పెళ్లి కార్డులో ఇది గమనించారా? నాగచైతన్య, శోభితల వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి పత్రికలో నాగచైతన్య సొంత తల్లి లక్ష్మీతో పాటూ ఆమె రెండో భర్త పేరు కూడా ఉంది. దీన్ని బట్టి కొడుకు పెళ్ళికి తల్లి లక్ష్మీ.. భర్తతో కలిసి రాబోతుందని తెలుస్తోంది. By Anil Kumar 19 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి అక్కినేని ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్న విషయం అందరికీ తెలిసిందే. నాగ చైతన్య–శోభితల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. ఈ వివాహానికి సంబంధించిన శుభలేఖలను పంచడం మొదలుపెట్టింది అక్కినేని కుటుంబం. ప్రస్తుతం నాగచైతన్య, శోభితల వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చై–శోభితల పెళ్ళి కార్డు సింపుల్‌గా చూడముచ్చటగా ఉంది. ఇందులో ఇద్దరి తల్లిదండ్రుల పేర్లతో పాటూ నాగచైతన్య నానమ్మ అన్నపూర్ణ, తాతయ్య నాగేశ్వరరావు అలాగే.. అమ్మమ్మ రాజేశ్వరి, తాతయ్య రామానాయుడుల ఆశీస్సులతో ఈ వివాహం జరుపుతున్నట్లుగా రాశారు. Also Read : నాగచైతన్యతో మీనాక్షి చౌదరి రొమాన్స్..!? పెళ్లి కార్డులో ఆమె పేరు కూడా.. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇదే పెళ్లి పత్రికలో నాగచైతన్య సొంత తల్లి లక్ష్మీతో పాటూ ఆమె రెండో భర్త పేరు కూడా ఉంది. దీన్ని బట్టి కొడుకు పెళ్ళికి తల్లి లక్ష్మీ భర్తతో కలిసి రాబోతుందని తెలుస్తోంది. దగ్గుబాటి రామానాయుడు కూతురైన లక్ష్మీ.. నాగార్జునను మొదటి పెళ్లి చేసుకొని.. కొన్నాళ్ల తర్వాత మనస్పర్థలతో విడాకులు తీసుకుంది. అయినా కూడా అక్కినేని ఫ్యామిలీతో సన్నిహితంగానే ఉంటుంది. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొడుకు నాగ చైతన్యతో ఇప్పటికీ కలిసే ఉంటుంది. చైతూ - సమంత మ్యారేజ్ కి కూడా లక్ష్మీ అటెండ్ అయింది. ఇప్పుడు కొడుకు రెండో పెళ్ళికి ఏకంగా తన భర్తతో కలిసి సందడి చేయనుంది. తల్లి లక్ష్మి తో అక్కినేని నాగ చైతన్య pic.twitter.com/vK9OBPAIum — General person (@Fact__teller) January 31, 2017 Also Read : RGV విచారణలో బిగ్ ట్విస్ట్..? దగ్గుబాటి ఫ్యామిలీతో బాండింగ్.. మరోవైపు చైతూ కూడా దగ్గుబాటి ఫ్యామిలీతో ఎంతో మంచి బాండింగ్ మైంటైన్ చేస్తున్నాడు. మామ వెంకటేష్ తో కలిసి 'వెంకీ మామ' అనే సినిమా కూడా చేశాడు. అలాగే దగ్గుబాటి రానాతో టైం దొరికినప్పుడల్లా చిల్ అవుతూ ఉంటాడు. అటు నాగ్ కూడా దగ్గుబాటి ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇప్పుడు చైతూ రెండో పెళ్ళికి దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్, రానా కుటుంబ సమేతంగా హాజరు కానున్నారు. మొత్తంగా అక్కినేని, దగ్గుబాటి కుంటుంబాలు నిత్యం మంచి అనుబంధాన్ని మైంటైన్ చేస్తూ ఇండస్ట్రీలో ఇతర కుంటుంబాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. Also Read: Bunny VS Pawan: అల్లు అర్జున్ ముందు పవన్ నథింగ్! View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) Also Read: అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం! #Shobita Wedding #Naga Chaitanya wedding #nagachaitanya #shobita-dhulipala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి