Thandel: ‘తండేల్’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే సాంగ్.. నాగచైతన్య డాన్స్ వేరే లెవెల్!

నాగచైతన్య నటిస్తోన్న ‘తండేల్’ మూవీ నుంచి కొత్త సాంగ్ రిలీజ్ అయింది. ‘నమో నమఃశివాయ’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో నాగ చైతన్య, సాయి పల్లవి డ్యాన్స్ ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా చైతన్య డ్యాన్స్ ఇరగదీసేశాడు.

New Update
Namo Namah Shivaya Lyrical Thandel song

Namo Namah Shivaya

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తూన్న కొత్త సినిమా ‘తండేల్’. ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు మేకర్స్ మరో అప్డేట్ అందించారు. 

Also Read: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే

సాంగ్ రిలీజ్

ఈ సినిమా నుంచి తాజాగా లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘నమో నమః శివాయ’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. నాగచైతన్య డ్యాన్స్‌ అదరగొట్టేశాడు. శివుని పాటకు చైతు వేసిన డ్యాన్స్‌కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూడలేదని కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ఇక సాయి పల్లవి అయితే ఉగ్రరూపం చూపించిందనే చెప్పాలి. డ్యాన్స్‌లో తన మార్క్ చూపించింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇకపోతే దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. కార్తికేయ 2 సినిమాతో సౌత్, నార్త్‌లో రికార్డులు క్రియేట్ చేశాడు. చందూ క్రియేటివిటీకి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.

Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా? 

ఇప్పుడు చైతుతో చందు సినిమా అనే సరికి అక్కినేని అభిమానులు, సినీ ప్రియులలో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. గీత ఆర్ట్స్ బ్యానర్‌లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

రియల్ సంఘటనల ఆధారంగా

శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారుల రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సముద్రంలో వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్థాన్ బోర్డర్‌లోకి వెళ్లడం.. అక్కడ పోలీసులకు చిక్కడం.. అక్కడ నుంచి వారు ఎలా బయటపడ్డారు అనే కాన్సెప్ట్‌తో సినిమా రాబోతుంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు