కొత్త సినిమా అనౌన్స్ చేసిన నాగ చైతన్య.. ఈసారి మైథలాజికల్ థ్రిల్లర్ తో

చైతూ బర్త్ డే సందర్భంగా అతని కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. చైతూ నెక్స్ట్ ప్రాజెక్ట్  విరూపాక్ష' మూవీ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఉండబోతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. #NC24 పేరుతో ఇది రూపొందుతుంది.

New Update
nc24 (1)

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో 'తండేల్' మూవీలో న‌టిస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై బ‌న్నివాసు నిర్మిస్తున్న ఈ చిత్రం శ్రీకాకుళం లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. 2025 ఫిబ్రవరి 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కాగా నేడు చైతూ బర్త్ డే సందర్భంగా అతని కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. 'తండేల్' తర్వాత చైతూ నెక్స్ట్ ప్రాజెక్ట్   విరూపాక్ష' మూవీ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఉండబోతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read : బుమ్రా దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు గజగజ.. 104 ఆలౌట్!

ఆసక్తి పెంచేలా ఫస్ట్ లుక్..

ఈ పోస్టర్‌లో ఒక అద్భుతమైన కన్ను ప్రతీకతో పాటు, రాక్ క్లైంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య కనిపించారు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ‘#NC24’ పేరుతో ఇది రూపొందుతుంది. ఇదొక మైథలాజిక‌ల్ థ్రిల్ల‌ర్ అని చిత్ర బృందం తెలిపింది. 

వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్‌వీసీసీ), సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మూవీ టీమ్ త్వరలోనే తెలుపనుంది. 

ఇది కూడా చదవండి: అంధులకు దారి చూపించే AI కళ్లద్దాలు.. చదివిస్తాయి కూడా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు