/rtv/media/media_files/2025/04/16/3VqIGQfAJHpSwkCESCwi.jpg)
OG First Song Update
OG First Song Update: ఒక పోస్టర్, ఒక్క గ్లింప్స్‌తోనే పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపిన మూవీ 'OG' ఎంతటి అంచనాలను పెంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆయన రాజకీయాల బిజీతో 'OG' షూటింగ్‌కు బ్రేక్ పడింది.
Also Read: హారర్ బాట పట్టిన నాగ చైతన్య.. 'NC 24' పై క్రేజీ అప్‌డేట్
అయితే, ఫ్యాన్స్ నిరాశపడుతున్న టైమ్ లో, సంగీత దర్శకుడు తమన్(Thaman) ఇచ్చిన తాజా అప్‌డేట్ మరోసారి 'OG'పై హైప్ పెంచేసింది. యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ – 'OG' సినిమాలో తమిళ స్టార్ సింబు పాడిన హై ఎనర్జీ సాంగ్ “ఫైర్ స్టార్మ్”పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ పాటను OG షూటింగ్ మళ్లీ మొదలయ్యే రోజే రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఫ్యాన్స్ ఈ పాట కోసం ఇప్పటికే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఇది చార్ట్‌బస్టర్ హిట్ అవ్వాలని ఎంతో ఆశపడుతున్నారు.
Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..
గ్యాంగ్‌స్టర్ డ్రామాగా 'OG'..
OG సినిమా 1980ల కాలానికి సంబంధించిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ సరసన ప్రియాంక అరూల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హాష్మి, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరిష్ ఉత్తమన్, షామ్ లాంటి నటులు ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
ఇప్పుడు ప్రతి పవన్ అభిమాని మనసులో ఒక్కటే ప్రశ్న OG షూటింగ్ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుంది? “ఫైర్ స్టార్మ్” ఎప్పుడు వస్తుంది? అని.. దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు!
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని