/rtv/media/media_files/2025/09/17/mohanlal-vrushabha-2025-09-17-07-24-41.jpg)
Mohanlal Vrushabha
Mohanlal Vrushabha: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, తన అద్భుత నటనతో ఇప్పటికే ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఆయన తాజా సినిమా ‘వృషభ’ లో ఓ పవర్ ఫుల్ పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్(Vrushabha First Look Poster) కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
The Battles, The Emotions, The Roar.
— Mohanlal (@Mohanlal) September 16, 2025
Vrusshabha Teaser drops on 18th September.#RoarOfVrusshabha#Vrusshabha#TheWorldofVrusshabha@Connekktmedia@balajimotionpic@FilmDirector_NK#ShobhaKapoor@EktaaRKapoor#CKPadmaKumar#VarunMathur@imsaurabhmishra@abhishekv_77… pic.twitter.com/v1oHpczF7w
ఈ పోస్టర్‌లో మోహన్‌లాల్ ఓ త్రిశూలం వెనుక నిలబడి, కళ్లలో కోపంతో నిండిన చూపుతో కనిపిస్తున్నారు. ఆయన ధరించిన యుద్ధ వస్త్రాలు, కవచాలు చూస్తుంటే ఈ సినిమా పౌరాణిక గాథల నేపథ్యంలో తెరెకెక్కుతోందని తెలుస్తోంది.
Also Read: "మహేష్ బాబును అడగగలరా?" జర్నలిస్ట్‌పై లక్ష్మీ మాంచు ఫైర్..
పౌరాణిక నేపథ్యంతో భారీ యాక్షన్ డ్రామా
‘వృషభ’ సినిమా కథ పౌరాణిక నేపథ్యంగా నడవనుంది. ఇందులో యుద్ధాలు, కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు కీలకంగా ఉంటాయని అర్థమవుతోంది. ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మోహన్‌లాల్ ఈ పోస్టర్‌ను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ,
“The Battles, The Emotions, The Roar. Vrusshabha teaser drops on 18th September” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంటే సెప్టెంబర్ 18న టీజర్ విడుదల కానుంది(Mohanlal Vrushabha Teaser). ఇప్పటికే పోస్టర్ ద్వారా టీజర్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
Also Read: రామ్ చరణ్ “పెద్ధి” ఇంట్రెస్టింగ్ అప్డేట్: అమ్మగా ‘అఖండ’ నటి!
బహుభాషా చిత్రంగా వృషభ
ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో నేరుగా చిత్రీకరిస్తున్నారు, హిందీ, కన్నడ భాషల్లో అనువాదంగా విడుదల చేయనున్నారు. ఇది ఓ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా దర్శకుడు నంద కిషోర్ గతంలో "రానా", "పొగరు" వంటి హిట్ సినిమాలు తీశారు. ‘వృషభ’ సినిమా కథలోని భారీ స్థాయి యాక్షన్, డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిపి మాస్ ఆడియెన్స్‌కు నచ్చేలా రూపొందించినట్లు సమాచారం.
'వృషభ' నటీనటుల వివరాలు
ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు సమర్జిత్ లంకేష్, షనాయా కపూర్, జహ్రా ఎస్. ఖాన్, శ్రీకాంత్, రాగిణి ద్వివేది వంటి నటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. నిర్మాణం బాధ్యతలను బాలాజీ మోషన్ పిక్చర్స్, కనెక్ట్ మీడియా, ఏవీఎస్ స్టూడియోస్ కలసి చేపట్టాయి. ఈ భారీ చిత్రాన్ని అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!
“ఇది కేవలం సినిమా కాదు - ఓ అపార ప్రయాణం” – మోహన్‌లాల్
సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత, మోహన్‌లాల్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు:
“వృషభ షూటింగ్ ముగిసింది! ఇది కేవలం సినిమా కాదు – ఇది ఓ గొప్ప యాక్షన్ ఎంటర్‌టైనర్. మా దర్శకుడు నంద కిషోర్ విజన్, టీమ్ శ్రమ వల్లే ఇది సాధ్యమైంది. నిర్మాతలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ దీపావళికి మీరందరూ థియేటర్లలో ఈ సినిమాను ఆశ్వాదించండి!” అంటూ చెప్పుకొచ్చారు.
మొత్తానికి 'వృషభ' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ ద్వారా సినిమా రేంజ్ అర్థమవుతోంది. కథా నేపథ్యం, మోహన్‌లాల్ గెటప్ అన్నీ చూస్తుంటే ‘వృషభ’ ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. భావోద్వేగాలు, యాక్షన్, కుటుంబ విలువలు కలగలిసిన కథతో ఇది ఓ మాస్, క్లాస్ ఆడియెన్స్‌కి నచ్చేలా కనిపిస్తోంది. ఈ దీపావళికి విడుదలవుతున్న 'వృషభ' సినిమా ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి!