/rtv/media/media_files/2025/10/14/mithra-mandali-pre-release-2025-10-14-09-33-20.jpg)
Mithra Mandali Pre Release
Mithra Mandali Pre Release: హాస్యానికి పెద్ద పీట వేస్తూ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన "మిత్ర మండలి" అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. బీవీ వర్క్స్, సప్త అశ్వ మీడియా వర్క్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు సమర్పిస్తున్నారు. ప్రియదర్శి, సోషల్ మీడియా ఫేమ్ నిహారికా ఎన్‌ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించగా, విజయేంద్ర దర్శకత్వం వహించారు.
Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అక్టోబర్ 13న ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శ్రీ విష్ణు మాట్లాడుతూ..
"తిప్పరా మీసం టైమ్‌లో విజయ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇప్పుడు తను దర్శకత్వం వహించిన మిత్ర మండలి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్న. ట్రైలర్ చాలా ఫన్నీగా ఉంది. ప్రియదర్శి ఎప్పుడూ మంచి ఎంటర్‌టైనర్, మంచి కథలు ఎంచుకుంటాడు. నిహారికా రీల్స్ చూసేవాణ్ని, ఇప్పుడు తెలుగులో సినిమా చేయడం చాలా బాగుంది. మిత్ర మండలి పాటలు బాగా వచ్చాయి. బన్నీ వాసు గారు ఉన్నారంటే అంటే ఈ సినిమా హిట్ ఖాయం!" అని అన్నారు.
Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్..!
ప్రియదర్శి కామెంట్స్..
"మిత్ర మండలి సినిమాను నేను ఇప్పుడే చూశాను. నిజంగా బాగా వచ్చింది. ఇది నచ్చకపోతే ఇక నా సినిమాలు చూడకండి! దీపావళిని ముందే మీ ఇంటికి తీసుకొస్తున్నాం. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కి రండి, నవ్వులు ఖాయం." అని అన్నారు
బన్నీ వాసు మాట్లాడుతూ.. "ప్రియదర్శిపై నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ట్రైలర్‌కి నెగటివ్ కామెంట్లు వచ్చినా, థియేటర్‌లో ప్రతి సీన్‌లో నవ్విస్తామనే నమ్మకం ఉంది."
Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!
భాను ప్రతాప్ మాట్లాడుతూ.. "సినిమా చాలా బాగా వచ్చింది. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. హేటర్స్‌కీ థాంక్స్ చెబుతాం, వాళ్ల వల్లే మేము ఇంకా బెటర్ అయ్యాం." అని అన్నారు.
డా. విజయేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. "హై నాన్నా తర్వాత మళ్లీ ప్రియదర్శితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఇది 100% పైసా వసూల్ సినిమానే." అని అన్నారు.
సంగీత దర్శకుడు RR ధ్రువన్ మాట్లాడుతూ.. "ఈ సినిమా వల్ల నాకు నిజమైన ఫ్రెండ్స్ దొరికారు. మీ దీపావళిని మరింత రంగులుగా మార్చే సినిమా ఇది." అని అన్నారు.
బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, రాఘ్ మయూర్, ప్రసాద్ బెహరా, వంటి హాస్య నటులతో ఈ సినిమా గట్టిగానే నవ్వించనుంది. అక్టోబర్ 16న థియేటర్లలో చూడండి. అక్టోబర్ 15న ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు వాటిపై ఓ లూకేయ్యండి.
Follow Us