/rtv/media/media_files/2025/05/07/mqAUmpyBKeDkhEAPbHxv.jpg)
Miss World Competitions in Hyderabad
Miss World 2025: 72వ ప్రపంచ సుందరి పోటీలకు ఈ ఏడాది తెలంగాణ ఆతిథ్యం వహిస్తోంది. మే 10 నుంచి హైదరాబాద్ వేదికగా అందాల పోటీలు నిర్వహించేందుకు భారీ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ కల్చర్, హెరిటేజ్, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసేలా వివిధ కార్యక్రమాలతో 20 రోజుల ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ప్రపంచ సుందరీమణుల రాకతో హైదరాబాద్ సందడిగా మారనుంది. మే 10న గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ నృత్య ప్రదర్శనలతో ఈవెంట్ ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు.
ఉచిత ఎంట్రీ పాస్..
అయితే సామాన్య ప్రజలు కూడా ప్రపంచ ప్రఖ్యాత మిస్ వరల్డ్ ఈవెంట్‌కి హాజరయ్యేందుకు బంపర్ అవకాశాన్ని అందిస్తోంది తెలంగాణ టూరిజం శాఖ. ఈవెంట్ ను లైవ్ లో వీక్షించేందుకు ఉచిత ఉచిత ఎంట్రీ పాస్‌లును అందిస్తోంది. అయితే ఆన్లైన్ సెలెక్షన్ ప్రాసెస్ లు ఇవ్వనున్నారు. దీని కోసం మీరు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
ఎలా అప్లై చేయాలి?
మిస్ వరల్డ్ 2025 ఫ్రీ పాస్‌లు పొందడానికి ముందుగా మీరు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ (tourism.telangana.gov.in)లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం అక్కడ ఇవ్వబడిన ప్రత్యేకంగా రూపొందించిన ఒక యాక్టివిటీలో పాల్గొనాలి. ఈ యాక్టివిటీలో ఎంపికైన వారికి అధికారికంగా ఒక కన్ఫర్మేషన్ ఇమెయిల్ వస్తుంది. ఇది ఉచిత ఎంట్రీ పాస్‌ను సేకరించడానికి ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది.
Get Complimentary Passes for #MissWorld2025 Events
— Informed Alerts (@InformedAlerts) May 6, 2025
Register online at Telangana Tourism for a chance to win complimentary passes to Miss World events. Passes can be collected at Gachibowli Stadium from 8th May 2025. pic.twitter.com/hEenQcOwUt
పాస్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి..
వేదిక: బాక్స్ ఆఫీస్, గచ్చిబౌలి స్టేడియం
తేదీలు: 2025 మే 8వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి
అందం, ప్రతిభ, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రపంచ వేదిక కానున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్ లో మీరు పాల్గొనాలి అనుకుంటే.. వెంటనే టూరిజం అధికారిక వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకొని.. మీ లక్ పరీక్షించుకోండి.
telugu-news | Miss World 2025 hyderabad | miss world 2025 entry pass