'RC16' లో మున్నా భయ్యా.. ఇదెక్కడి మాస్ రా మావా రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబోలో 'RC16' మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల దీని రెగ్యులర్ షూట్ మొదలైంది. ఈ చిత్రంలో ‘మీర్జాపూర్’ సిరీస్ ఫేమ్, బాలీవుడ్ నటుడు దివ్యేందు భాగమయ్యారు. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. By Anil Kumar 30 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' మూవీ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'RC16' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రం కోసం భారీ కాస్టింగ్ ను తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు భాగం అవ్వగా.. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైతం ఈ సినిమాలో భాగం అయ్యారు. కీలక పాత్రలో 'మీర్జాపూర్' నటుడు.. బాలీవుడ్ ఫేమస్ వెబ్ సిరీస్ 'మీర్జాపూర్' లో మున్నా భయ్యా అనే పాత్రతో భారీ క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు దివ్యేందు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు." మా భయ్యా, మీ భయ్యా, మున్నా భయ్యా. వెల్‌కమ్ దివ్యేందు. లెట్స్ రాక్ ఇట్" అని పేర్కొన్నారు. Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా Our Bhayya…Your Bhayya…MUNNA BHAYYA! Welcome onboard dear @divyenndu brother 🤍🤗Let’s rock it💥#RC16 pic.twitter.com/55r3LeAzp7 — BuchiBabuSana (@BuchiBabuSana) November 30, 2024 ఇది కూడా చదవండి: భారత్‌తో కంగారు రెండో మ్యాచ్.. పింక్ బాల్‌కు వేదిక కానున్న అడిలైడ్ 'RC16' లో మున్నా భయ్యా నటిస్తున్నాడనే విషయం తెలిసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ మేరకు బచ్చిబాబు సెలక్షన్ సూపర్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో 'RC16' లో దివ్యేందు ఎలాంటి తరహా పాత్రలో కనిపిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. రూరల్ విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్న ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో అరబ్ షేక్ అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్... Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? #Divyenndu #munna bhaiya #rc16 #ram-charan-rc16 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి