Mogali Rekulu: నాకు 'మొగలిరేకులు' కష్టాలు.. స్టేజీ మీదే మంత్రి కోమటిరెడ్డి ఆవేదన.. వీడియో వైరల్!

''మొగలి రేకులు'' సీరియల్ వస్తున్నప్పుడు  ఇంట్లో నాకు  టీ ఇవ్వడానికి కూడా ఎవరూ ఉండేవారు కాదు'' అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update

Mogali Rekulu:  ''మొగలి రేకులు'' సీరియల్ వస్తున్నప్పుడు  ఇంట్లో నాకు  టీ ఇవ్వడానికి కూడా ఎవరూ ఉండేవారు కాదు'' అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సీరియల్ అంటే చాలు ఆడవాళ్లు టీవీలకు అతుక్కుపోతారు. సీరియల్ అయిపోయే ఆ  అరగంట  ఇంట్లో భర్తను కూడా పట్టించుకోరు కొందరు. అంత ఇంట్రెస్టింగ్ గా  సీరియల్ చూస్తుంటారు. అలాంటి  ఓ సంఘటననే  గుర్తుచేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 

Also Read: Lishalliny Kanaran : ఆ పూజారి లైంగికంగా వేధించాడు... బ్లౌజులో చేయి పెట్టి .. నటి సంచలన ఆరోపణలు!

టీ ఇచ్చేవారు కూడా కాదు!

ఇటీవలే  'మొగలిరేకులు' ఫేమ్  ఆర్. కే  సాగర్  నటించిన  'ది 100' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మంత్రి కోమటి రెడ్డి.. సాగర్ గురించి ప్రస్తావిస్తూ  మొగలిరేకులు' సీరియల్ విశేషాలను పంచుకున్నారు. కోమటి రెడ్డి మాట్లాడుతూ.. మా ఇంట్లో  మొగలిరేకులు చూస్తుంటే.. నేను మధ్య మధ్యలో చూసేవాడిని. ఆ సమయంలో నాకు టీ ఇవ్వడానికి కూడా ఎవరూ ఉండేవారు కాదు. పని అమ్మాయిని అడిగితే సీరియల్ అయిపోయాక వస్తాను అని చెప్పేది!  చివరికి నేనే పెట్టుకోవడం లేదా మా మిసెస్ ని బతిమాలుకోవడమో చేసేవాడిని. అలాంటి సీరియల్ తో సాగర్  అందరికీ సుపరిచితుడయ్యాడు  అంటూ సరదాగా మాట్లాడారు.   'ది 100'  జులై 24న థియేటర్స్ లో విడుదల కానుంది.

మొగలిరేకులు సీరియల్ తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక సంచలనం  సృష్టించింది. సుమారు ఏడేళ్ల పాటు  బుల్లితెర ప్రియులను మంత్రముగ్దులను చేసింది.  1368 పైగా ఎపిసోడ్లు సాగిన ఈ సీరియల్ ఎక్కడ బోర్ కొట్టించలేదు.

Also Read: Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!

Advertisment
తాజా కథనాలు