Lishalliny Kanaran : ఆ పూజారి లైంగికంగా వేధించాడు... బ్లౌజులో చేయి పెట్టి .. నటి సంచలన ఆరోపణలు!

మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషల్లిని కనారన్  మలేషియాలోని ఓ భారతీయ పూజారిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆశీర్వాదాల నెపంతో మలేషియాకు చెందిన పూజారి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించారు.  

New Update
Lishalliny Kanaran

మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషల్లిని కనారన్  మలేషియాలోని ఓ భారతీయ పూజారిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆశీర్వాదాల నెపంతో మలేషియాకు చెందిన పూజారి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించారు.  ఈ సంఘటన గత నెలలో మలేషియాలోని సెపాంగ్‌లోని మరియమ్మన్ ఆలయంలో జరిగిందన్నారు.  కనారన్ తన బాధను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా పంచుకున్నారు. తన తల్లి ఇండియాలో ఉండటంతో జూన్ 21న సెపాంగ్‌లోని మరియమ్మన్ ఆలయాన్ని ఒంటరిగా సందర్శించానని లిషల్లిని చెప్పింది. ఆలయ ఆచారాలు తనకు తెలియకపోవడంతో,  ఆమె పూర్తిగా పూజారిపై ఆధారపడింది.  

ప్రైవేట్ రూమ్ కు పిలిచి

ఆశీర్వాదం కోసం తన ప్రైవేట్ రూమ్ కు పిలిచిన  పూజారి తనను అసభ్యంగా ఛాతీపై తాకుతూ భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం అంటూ నీటిని తనపై పోశాడని, తన బ్లౌజ్ లోపల చేయితో తాకడానికి ప్రయత్నించాడని ఆమె ఇన్స్టాలో ఆరోపించారు.  దీనిపై ఈ నెల 4న మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా 2021లో మిస్ గ్రాండ్ మలేషియా కిరీటాన్ని గెలుచుకుంది లిషల్లిని కనారన్ . ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 90 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె సెలంగోర్‌కు చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని కూడా.  



Advertisment
తాజా కథనాలు