Chiranjeevi: తల్లి అంజనాదేవికి అనారోగ్యం.. చిరంజీవి సంచలన ప్రకటన!

చిరంజీవి తన తల్లి అంజనా దేవి అనారోగ్యంపై వస్తున్న వార్తలకు స్పందించారు. ఆమె రెండు రోజులుగా కొంచెం అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఎలాంటి ఊహాజనిత వార్తలు స్ప్రెడ్ చెయ్యొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

New Update
megastar chiranjeevi clarity on his mother anjana devi health issue

megastar chiranjeevi clarity on his mother anjana devi health issue Photograph: (megastar chiranjeevi clarity on his mother anjana devi health issue)

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తాజాగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆమెను చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు ప్రచారం జరిగింది. ఆ వార్తలపై చిరంజీవి తాజాగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ ‌వేదికగా ఆయన ట్వీట్ చేశారు.

Also Read: Maha Kumbh: కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!

అమ్మ క్షేమం

‘‘మా అమ్మ అనారోగ్యంతో ఉన్నారని, ఆసుపత్రిలో చేరారని మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు చూశాను. దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆమె రెండు రోజులుగా కొంచెం అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా, పూర్తిగా క్షేమంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి ఊహాజనిత వార్తలను ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అవగాహనకు ధన్యవాదాలు’’ అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌తో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. 

Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ ..  15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్  !

ఇక మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని తెలిసింది. అయితే అక్కడ ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌కు బయల్దేరినట్లు సమాచారం. 

Also Read: Satya Nadella: ఇంటర్వ్యూ కోసం ఏకంగా సత్య నాదెళ్లకే మెయిల్‌..ఎంత సేపటిలో రిప్లై వచ్చిందో తెలుసా!

ఇటీవలే బర్త్ డే వేడుకలు 

ఇదిలా ఉంటే ఇటీవలే చిరంజీవి.. అమ్మ అంజనాదేవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలను జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అమ్మకు విషెష్ తెలియజేశారు. రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కూడా తమ నాన్నమ్మ బర్త్ డే వేడుకల్లో సందడి చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు