/rtv/media/media_files/2026/01/02/movie-2026-01-02-13-23-46.jpg)
MOVIE
రాకేష్ మాధవన్(Rakesh Madhavan) దర్శకత్వంలో మాస్టర్ మహేంద్రన్(Mahendran) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'నీలకంఠ'(Neelakanta) నేడు థియేటర్స్ లో విడుదలైంది. రిలీజ్ కు ముందే ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో సీనియర్ నటులు పృథ్వీ రాజ్, రాంఖీ, శుభలేఖ సుధాకర్, ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే కథానాయికగా యష్ణ ముతులూరి నటించగా.. కంచరపాలెం రాజు, అనిల్ ఇనమడుగు కీలక పాత్రలు పోషించారు.
Also Read : హీరో మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం
స్నేహ ఉల్లాల్
చాలా కాలం తర్వాత నటి స్నేహా ఉల్లాల్ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చారు. సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ మెరిసింది. స్నేహ ఎనర్జిటిక్ స్టెప్పులు అభిమానులను అలరించాయి.
కథా నేపథ్యం
సరస్వతీపురం అనే గ్రామంలో కట్టుబాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ఆ ఊరి పెద్ద రాఘవయ్య (రాంకీ) తప్పు చేసిన వారికి వింతైన శిక్షలు విధిస్తుంటాడు. నాగభూషణం కొడుకు నీలకంఠ (మహేంద్రన్) పదో తరగతిలో ఒక తప్పు చేశాడన్న కారణంతో, అతడిని 15 ఏళ్ల పాటు ఊరు దాటకూడదని, చదువుకోకూడదని రాఘవయ్య శిక్షిస్తాడు.
నీలకంఠ చిన్ననాటి స్నేహితురాలు సీత (యాశ్న ముత్తులూరి) ఊరు వదిలి పైచదువులకు వెళ్తుంది. 15 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన సీతను నీలకంఠ ప్రేమిస్తాడు. అయితే, ఆమె తండ్రి అయిన సర్పంచ్ (బబ్లూ పృథ్వీ) వీరి ప్రేమకు అడ్డుపడతాడు. ఈ క్రమంలో నీలకంఠ తన నిజాయితీని నిరూపించుకోవడానికి సర్పంచ్ పదవికి పోటీ చేస్తాడు. మరోవైపు, మండల స్థాయి కబడ్డీ పోటీల్లో తన గ్రామాన్ని గెలిపించి, తల్లికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నాడు అనేదే ఈ సినిమా కథ.
నటీనటులు
హీరో మాస్టర్ మహేంద్రన్ తన నటనతో సినిమాకు కీలకంగా మారారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో పరిణతి చూపించాడు. సీనియర్ నటులు రాంకీ, పృథ్వీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సంగీతం
మార్క్ ప్రశాంత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. పాటలు వింటేజ్ ఫీలింగ్‌ను ఇచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రియలిస్టిక్‌గా ఉన్నాయి.
"నీలకంఠ" కేవలం ఒక గ్రామీణ డ్రామా మాత్రమే కాదు, ఇందులో కమర్షియల్ అంశాలతో పాటు బలమైన కంటెంట్ ఉంది. కొత్త ఏడాదిలో ఒక మంచి చిత్రాన్ని చూడాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.
Follow Us