Manchu Manoj: 'అత్తరు సాయిబు' గా మనోజ్ .. అసలు విషయం ఏంటంటే?

మంచు మనోజ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. '90 ఎం. ఎల్' ఫేమ్ శేఖర్ రెడ్డి డైరెక్షన్ లో 'అత్తరు సాయిబు' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. మే 20 మనోజ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను లాంచ్  చేయనున్నారని టాక్.

New Update

Manchu Manoj: మంచు మనోజ్ చాలా కాలం గ్యాప్ తర్వాత ;భైరవం' సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నారు.  విజయ్ కనకమేడల దర్శకత్వంలో మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే మనోజ్ సోలోగా సినిమా వచ్చి చాలా కాలమైంది. ఏడాది క్రితం 'వాట్ ది', ‘అహం బ్రహ్మస్మి’ సినిమాలు అనౌన్స్ చేశాడు. కానీ వాటి షూటింగ్, ఇతర విషయాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్  లేవు. 

 'అత్తరు సాయిబు' 

ఈ క్రమంలో మనోజ్  మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్  లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.  '90 ఎం. ఎల్' ఫేమ్ శేఖర్ రెడ్డి డైరెక్షన్ లో 'అత్తరు సాయిబు' అనే టైటిల్ తో సినిమా తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మే 20 మనోజ్ పుట్టినరోజు సందర్భంగా పూజ కార్యక్రమాలతో సినిమాను లాంచ్  చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. టైటిల్ వింటుంటే.. ఈ సినిమాలో మరోసారి మనోజ్ కామెడీ యాంగిల్ చూడబోతున్నట్లు అర్థమవుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతున్నట్లు టాక్. ఈ సినిమాలోని నటీ నటులు, ఇతర విషయాల  పై త్వరలోనే అప్డేట్ రానుంది. 

latest-news | telugu-news | cinema-news | manchu-manoj | manoj Attaru Saibu  manoj Attaru Saibu 

Advertisment
Advertisment
తాజా కథనాలు