Manchu Manoj: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మనోజ్, నారా రోహిత్, డైరెక్టర్ విజయ్ , బెల్లంకొండా శ్రీనివాస్ హాజరయ్యారు.
కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్
ఈ సందర్భంగా వేదికపై హీరో మనోజ్ AV వీడియోను ప్రదర్శించగా.. భావోద్వేగానికి గురయ్యారు.దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ తెరపై కనిపిస్తుండడంతో తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు.
#ManchuManoj is CRYING by Seeing His JOURNEY in #Bhairavam Event - STRONG ComeBack Loading.
— GetsCinema (@GetsCinema) May 18, 2025
pic.twitter.com/BGphO0X60E
Also Read: Ananya: వైట్ శారీలో అనన్య అందాలకు కుర్రాళ్ళు ఫిదా.. ఫొటోలు ఇక్కడ చూడండి!
మనోజ్ చివరిగా 2017 లో గుంటూరోడు సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత కొంత కాలం సినిమాలకు దూరమయ్యారు. వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ తొమ్మిదేళ్ల తర్వాత 'భైరవం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీంతో తన AV చూసుకొని ఎమోషనల్ అయ్యారు.
సూపర్ హిట్ సినిమాలు
యూనిక్ స్టైల్, ఎనర్జీ, డిఫరెంట్ స్క్రిప్టులు ఎంచుకోవడంలో మనోజ్ ప్రత్యేకతను పొందారు. మనోజ్ నటించిన బిందాస్, వేదం, కరెంట్ తీగ, ఝుమ్మంది నాదం, పోటుగాడు వంటి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. హీరోతో పాటు మనోజ్ లోని కామెడీ యాంగిల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
telugu-news | cinema-news | Bhairavam Trailer manchu-manoj | manchu manoj emotional
Also Read: Manchu Manoj: ''శివయ్య.. అంటే శివుడు రాడు''.. అన్న విష్ణుపై.. మనోజ్ ట్రోలింగ్! వీడియో వైరల్