Manchu Lakshmi: నానికి కరెక్ట్ విలన్ డాడీనే.. 'ప్యారడైజ్' మూవీ అప్‌డేట్ లీక్ చేసిన మంచు లక్ష్మి

మంచు ఫ్యామిలీ ఇటీవల వివాదాలకు బదులు సినిమాలతోనే వార్తల్లో నిలుస్తోంది. విష్ణు 'కన్నప్ప', మనోజ్ 'మిరాయ్'తో హిట్స్ కొట్టారు. లక్ష్మి 'దక్ష'తో రాబోతుండగా, మోహన్‌బాబు 'ది ప్యారడైజ్'లో విలన్‌గా కనిపించబోతున్నారు.

New Update
Manchu Lakshmi

Manchu Lakshmi

Manchu Lakshmi: ఏదో ఒక వివాదం, హాట్ కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో ఉండే మంచు ఫ్యామిలీ, ఈ మధ్య మాత్రం పూర్తిగా సినిమా అప్‌డేట్స్‌తోనే హెడ్లైన్లలో కనిపిస్తోంది. ఒకరికి తర్వాత ఒకరు కొత్త ప్రాజెక్ట్స్‌ ప్రకటిస్తూ మంచు ఫ్యామిలీ మెయిన్‌స్ట్రీమ్‌లోకి వస్తోంది.

ఇటీవల మంచు విష్ణు నటిస్తున్న భారీ సినిమా 'కన్నప్ప'పై రిలీజ్ కి ముందు భారీ హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో విష్ణు నటనకు మంచి స్పందన కూడా లభించింది. ఇక మంచు మనోజ్ నటించిన 'మిరాయ్' సినిమా సూపర్ సక్సెస్ కొట్టింది. ఎన్నో ఏళ్లగా హిట్ కోసం ఎదురుచూస్తున్న మనోజ్‌కు ఇది కెరీర్‌లో మళ్లీ మంచి బూస్ట్ ఇచ్చింది.

Also Read: ఆ ఒక్క విషయంలో 'మిరాయ్' డిస్సపాయింట్ చేసిందట..! ఏంటంటే..?

ఇక ఇప్పుడు మంచు లక్ష్మి కూడా అదే దారిలో తన తాజా చిత్రం 'దక్ష'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్‌లో మంచు లక్ష్మి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పి అందరినీ ఆకర్షించారు.

మంచు లక్ష్మి ఎమోషనల్ స్పీచ్

“మనోజ్ రీ ఎంట్రీ నాకు నిజంగా ఇన్‌స్పిరేషన్. ప్రతి ఒక్కరికి జీవితంలో కష్టాలు వస్తాయి. నా జీవితం ఇంతే అనుకుంటే అది నరకంలా కనిపిస్తుంది.. పెద్దగా ఆలోచిస్తే స్వర్గం లాంటి జీవితం ఉంటుంది,” అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది.

Also Read: 'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో

అలాగే, తన తండ్రి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ, “మా నాన్నగారు వయసుతో పని లేదు. ఇప్పుడు కూడా ఆయన ఎనర్జీ చూస్తే ఆశ్చర్యపడాల్సిందే. ప్రస్తుతం ఆయన 'ది ప్యారడైజ్' అనే సినిమాలో నటిస్తున్నారు. నేను ఈ విషయం చెబుదామా వద్ద అని ఆలోచించా కానీ చెప్పేస్తున్నా. ఆ సినిమాలో ఆయన పాత్ర కోసం ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఈ వయసులోనూ డెడికేషన్ చూపిస్తూ శారీరకంగా ఎంతో శ్రమిస్తున్నారు” అని చెప్పారు.

Also Read: కనిపించి 'కన్నప్ప'ని.. వినిపించి 'మిరాయ్'ని ప్రభాస్ ఆదుకున్నాడా..?

మోహన్ బాబు విలన్‌గా? (Mohan Babu Villain in Nani Paradise Movie)

‘ది ప్యారడైజ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మంచు లక్ష్మి మాటలతో ఆ వార్తలు నిజమేనని తేలిపోయింది. ఈ చిత్రంలో నాని హీరోగా నటిస్తున్నాడు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: నా తమ్ముడికి బెస్ట్ విషెస్.. 'మిరాయ్' మూవీపై మంచు విష్ణు ట్వీట్ వైరల్..!

ఎనిమిది భాషల్లో రిలీజ్ ప్లాన్

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమాను 2026 మార్చి 26న ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

అయితే, ఈ మధ్యకాలంలో మంచు కుటుంబానికి సినిమాల పరంగా మంచి టైం వచ్చినట్టే కనిపిస్తోంది. ఒకవైపు విష్ణు ‘కన్నప్ప’, మరోవైపు మనోజ్ ‘మిరాయ్’, ఇప్పుడు లక్ష్మి ‘దక్ష’, పైగా మోహన్ బాబు కీలక పాత్రలో ‘ది ప్యారడైజ్’ ఇలా వరుస సినిమాలు చేస్తూ మంచు ఫ్యామిలీ ఫుల్ బిజీ అయిపోయింది. 

Advertisment
తాజా కథనాలు