Mana Shankara Varaprasad Garu : మెగా ఫ్యాన్‌ కు కిక్కిచ్చే దీపావళి సర్ ప్రైజ్.. పోస్టర్ చూస్తే పిచ్చెక్కిపోతారు

దివాళీ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చిరంజీవి గ్రీన్ హుడీ జాకెట్‌లో సైకిల్ తొక్కుతూ యువకుడిలా స్టైలిష్‌గా కనిపించారు. ఈ చిత్రం సంక్రాంతి 2026కి విడుదల కానుంది.

New Update
FotoJet

Mana Shankara Varaprasad Garu

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'. మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, అనిల్ రావిపూడి దీపావళి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. "మన శంకర వరప్రసాద్ గారు" టీమ్ తరపున మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు. నవ్వుల టపాసులు సంక్రాంతికి పేలుద్దాం'' అంటూ ఆయన చేసిన ట్వీట్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో చిరంజీవి గ్రీన్ హుడీ జాకెట్‌లో సైకిల్ తొక్కుతూ యువకుడిలా స్టైలిష్‌గా కనిపించారు. 

Mana Shankara Varaprasad Garu

 మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఈ చిత్రంలో ఆయన పోషిస్తున్న పాత్రకు 'శంకర వరప్రసాద్' అనే పేరును పెట్టారు. ఇది చిరంజీవిపై అనిల్ రావిపూడికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో 157వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి.. శంకర వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. 

చిరంజీవితో 'సైరా' తర్వాత నయనతార నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేథరిన్ ట్రెసా కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. 

అనిల్ రావిపూడి ఇప్పటికే ముచ్చటగా మూడో షెడ్యూల్ను పూర్తి చేసినట్లు తెలిపారు. కొన్ని ముఖ్యమైన షెడ్యూల్స్ కేరళలో కూడా జరిగాయి. ఈ సినిమాను ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ఈ చిత్రంలో స్టైలిష్ లుక్లో, కొత్త అటిట్యూడ్‌తో కనిపిస్తారని, ఆయన లుక్స్ కోసం వీఎఫ్ఎక్స్‌ను చాలా తక్కువగా ఉపయోగించి 95% వరకు ఒరిజినల్‌గా ఉంచుతున్నామని అనిల్ రావిపూడి గతంలో చెప్పారు. 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరి 12, 2026న విడుదల చేసే అవకాశం ఉంది. సంక్రాంతి పండగ అనిల్ రావిపూడికి సెంటిమెంట్‌గా ఉండటంతో, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Advertisment
తాజా కథనాలు