Mana Shankara Varaprasad Garu Movie: మీసాల పిల్ల అంటూ చిరంజీవి.. కొత్త సాంగ్ ప్రోమో అదిరింది డూడ్!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా చిత్ర యూనిట్ దసరా సందర్భంగా మీసాల పిల్ల సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది. సాంగ్ ప్రోమో అయితే అదిరిందని నెటిజన్లు అంటున్నారు.

New Update
Mana Shankara Varaprasad Garu Movie

Mana Shankara Varaprasad Garu Movie

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇది వరకే చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో భాగంగా చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. అయితే దసరా పండుగ సందర్భంగా మీసాల పిల్ల సాంగ్ ప్రోమోను చిత్ర యూనిల్ రిలీజ్ చేసింది. సాంగ్ ప్రోమో అయితే అదిరిందని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Akhanda 2 Release Date: ఇక థియేటర్స్ లో బాలయ్య తాండవమే.. అఖండ 2 నుంచి అదిరిపోయే అప్డేట్

ప్రోమో అయితే అదిరిపోయింది..

సాంగ్ ప్రోమోనే ఇలా ఉంటే.. ఫుల్ పాట ఎలా ఉంటుందో ఊహకే వదిలేస్తున్నానని అంటున్నారు. అయితే ఈ పాటను ప్రముఖ గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌ పాడారు. దీనికి భాస్కరభట్ల సాహిత్యం అందించగా భీమ్స్‌ స్వరాలు ఇచ్చారు. అయితే ఈ ప్రోమోలో చిరంజీవి హీరోయిన్ నయనతారను ఆటపట్టిస్తారు. అయితే ఈ ఫుల్ సాంగ్‌ త్వరలోనే రిలీజ్ కానుందని తెలిపారు. మరి ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఇది కూడా చూడండి:  Varun Tej Son Name: వరుణ్ తేజ్-లావణ్య దంపతుల కొడుకు పేరేంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు