Lawrence Bishnoi Gang: దేశవ్యాప్తంగా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు వినిపిస్తోంది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య తర్వాత అతడి పేరు మరింత మారుమోగిపోయింది. సిద్దిఖీని హత్య చేసింది తామేనని బిష్ణోయి గ్యాంగ్ ప్రకటించుకున్న తర్వాత మరింత చర్చనీయాంశమైంది. ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి బిష్ణోయి గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
Also Read: కిలో వెండి అక్షరాల లక్ష రూపాయలు!
సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు
కాగా లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ సబర్మతి జైలులో ఉన్నాడు. ఈ ఏడాది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులోనూ లారెన్స్ బిష్ణోయ్ పేరు గట్టిగా వినిపించింది. ప్రస్తుతం బిష్ణోయ్ జైలులో ఉండడంతో ఆ గ్యాంగ్ లోని ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు కార్యకలాపాలు చూసుకుంటున్నారు. వారిలో బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఒకరు కాగా.. గోల్డిబ్రార్, రోహిత్ గోదర్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు విదేశాల్లో తిరుగుతున్నారు.
Also Read: కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్.. బండి విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
కృష్ణ జింకలను సల్మాన్ వేటాడటంతో
బిష్ణోయ్ సామాజిక వర్గం ఎంతగానో ఆరాధించే రెండు కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడి చంపినప్పటి నుంచి అతడిని బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసుకుంది. దీని కారణంగానే సల్మాన్‌ను హతమార్చేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇంఉదలో భాగంగానే సల్మాన్ తో సన్నిహితంగా ఉన్న ప్రతీ ఒక్కరినీ చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి.
Also Read: రాష్ట్రంలో బాణాసంచా నిషేధం.. గోదాంలు సీల్ చేయాంటూ హైకోర్టు ఆదేశాలు!
రూ.5 కోట్లు ఇస్తే ముగింపు పలుకుతాం
ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోసారి చంపేస్తాం అంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న ఈ గొడవకి ఒక ముగింపు పలకాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఇటీవల ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్‌కు ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే. అడిగిన మొత్తాన్ని చెల్లించకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ వచ్చింది. దీంతో అంతా షాక్ అయ్యారు.
Also Read: గొప్ప మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. 50 స్కూళ్ళు దత్తత తీసుకొని.
సల్మాన్ ను బెదిరించి తప్పుచేశా
అయితే ఇప్పుడు అదే నెంబర్ నుంచి మరో మెసేజ్ వచ్చింది. సల్మాన్ ను బెదిరించి తప్పుచేశానని తాజాగా ఆ నిందితుడు తెలిపాడు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసులకు మరో మెసేజ్ పెట్టాడు. సల్మాన్ కు బెదిరింపు మెసేజ్ పంపించి చాలా తప్పుచేశానని.. తనను క్షమించాలని ఆ మెసేజ్లో పేర్కొన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ మెసేజ్ లు ఝార్ఖండ్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.