Maranamass: డార్క్ కామెడీ అంటే పడి చస్తారా..? అయితే వెంటనే ఈ సినిమా చూడండి

సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌లో ఉన్న మలయాళ డార్క్ కామెడీ మూవీ ‘మరణమాస్’ బస్సు ప్రయాణంలో జరిగే ఓ వృద్దుడి మరణంపై కథ నడుస్తోంది. శివ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌తోనే హైప్‌ సృష్టించింది. డార్క్ హ్యూమర్ ను ఇష్టపడే వారికి ఇది తప్పక నచుతుంది.

New Update

Maranamass: ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫారమ్ సోనీ లివ్‌లో(Sony Liv) స్ట్రీమింగ్‌కు వచ్చిన మలయాళ డార్క్ కామెడీ(Dark Comedy) మూవీ ‘మరణమాస్’ ఇప్పటికే ట్రైలర్‌తో మంచి హైప్‌ను సృష్టించింది. శివ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఒక రాత్రిలో జరిగే బస్సు ప్రయాణాన్ని ఆధారంగా చేసుకుని, అందులో జరిగే అనూహ్య సంఘటనల చుట్టూ నడుస్తుంది. కథా నేపథ్యానికి తగ్గట్టు సినిమా నెమ్మదిగా మొదలవుతుంది కానీ కొద్ది సేపటికి ఊహించని మలుపులతో ఆసక్తికరంగా మారుతుంది.

Also Read: ఇలా ఉన్నారేంట్రా అయ్యా..! 'యమదొంగ' రీ-రిలీజ్ లో అలీ గెటప్ రీ క్రియేట్ చేసి రచ్చ రచ్చ..

బస్సులో ప్రయాణించే కొన్ని పాత్రల్లో ఒకటైన 'లూక్' పాత్రలో బాసిల్ జోసెఫ్ కనిపిస్తాడు. అతని సరసన 'జెస్సీ'గా నటించిన అనిష్మ అనిల్‌కుమార్ కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. మరోవైపు, ఒక ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ అయిన 'బనానా కిల్లర్' కూడా ఈ బస్సులోనే ఉండటం కథకు థ్రిల్ జోడిస్తుంది. లూక్ ఓ వృద్ధుడి మరణానికి కారణమయ్యాడన్న అనుమానంతో కథ మలుపుతీసుకోగా, అదే సమయంలో అసలైన హంతకుడితో కలిసి బస్సులో చిక్కుకుపోవడం సినిమాలో మంచి సస్పెన్సు క్రియేట్ చేస్తుంది.

Also Read: 'రెట్రో' లెక్కలివే.. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్..!

డార్క్ హ్యూమర్‌..

బాసిల్ జోసెఫ్ తన యాస, డైలాగ్ డెలివరీ, టైమింగ్‌తో డార్క్ హ్యూమర్‌ను సూపర్ గా పండించాడు.. కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సీన్స్‌లో అతని పెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా నిలిచింది. జెస్సీ పాత్రలో అనిష్మ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అలాగే సిజు సన్నీ, రాజేష్ మాధవన్‌ల పాత్రలు కూడా సినిమాకు న్యాయం చేశాయని చెప్పొచ్చు.

Also Read: హరి హర వీరమల్లు 3rd సింగిల్ వచ్చేస్తోంది..

ట్రైలర్‌లో ఆకట్టుకున్న డార్క్ హ్యూమర్, సినిమాలోనూ ప్రేక్షకులకు నవ్వు తెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ప్రత్యేకించి, బస్సు జర్నీ మొదలయ్యాక నడిచే సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా మారతాయి. కొన్ని సీన్స్ సీరియస్ గా ఉన్నా, వాటిని కూడా కామెడీగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి..

విజువల్స్ విషయానికి వస్తే, సినిమాటోగ్రాఫర్ 'నీరజ్ రెవి' అదిరిపోయే  ఫ్రేములతో బస్సు జర్నీని విభిన్నంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. 'జెకె' సంగీతం ఆకట్టుకుంది,  స్క్రీన్‌ప్లే కొన్నిచోట్ల నీరసంగా ఉన్నా.. కొన్ని డైలాగ్స్ మరీ ల్యాగ్ అనిపించాయి.

సీరియల్ కిల్లర్ ఎస్కేప్ ఎపిసోడ్, కండక్టర్ బ్యాక్‌స్టోరీ, అలాగే స్మశాన సన్నివేశం సినిమాకు ఆకర్షణగా నిలిచాయి.

మొత్తానికి, ‘మరణమాస్’ ఓ వినూత్నమైన డార్క్ కామెడీ అనిపిస్తుంది. ప్రారంభంలో కథ నెమ్మదిగా సాగినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో వచ్చే థ్రిల్, కామెడీ  ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు, డార్క్ హ్యూమర్ ను ఇష్టపడే వారికి ఇది తప్పక నచుతుంది..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు