కాంగ్రెస్ లోకి మహేష్ బాబు.. వైరల్ అవుతున్న వీడియో

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మహేష్ కలిసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు ఫ్యాన్స్.. 'తరం మారిన.. కాంగ్రెస్ రక్తం మారదు'. అప్పట్లో తండ్రి, ఇప్పుడు తనయుడు.. ఇద్దరూ కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు.

mahesh revanth
New Update

Mahesh Babu With Revanth Reddy : సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజమౌళితో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మహేష్ రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటాడో తెలిసిందే. ఆయన తండ్రి కృష్ణ అప్పట్లో సినిమాల్లో రాణించాక.. రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. కానీ మహేష్ మాత్రం ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. 

అప్పుడు కృష్ణ.. ఇప్పుడు మహేష్ 

అయితే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మహేష్ కలిసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ ఈ వీడియోను ' తరం మారిన.. కాంగ్రెస్ రక్తం మారదు' అనే క్యాప్షన్ తో షేర్ చేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే.. అప్పట్లో రాజీవ్ గాంధీ పిలుపుతో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ లోకి చేరి.. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నియోజకవర్గం తరుపున ఎంపీగా గెలిచారు.

ఆ తర్వాత కొన్నాళ్ల పాటూ పార్టీకి తన సేవలందించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ మరణాంతరం రాజకీయాల నుంచి బయటికొచ్చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు మహేష్ బాబు.. రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాన్ని చెక్ రూపంలో అందజేశారు. 

Also Read : అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చైర్మన్ గా బాలీవుడ్ నిర్మాత

అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్.. తరం మారిన.. కాంగ్రెస్ రక్తం మారదు, అప్పట్లో తండ్రి.. ఇప్పుడు తనయుడు.. ఇద్దరూ కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారని గుర్తు చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం మహేష్ బాబు ఒక్క పార్టీకే అతీతం కాదని.. అన్ని పార్టీలకు సమదూరంలో ఉంటారని అభిప్రాయపడుతున్నారు. 

#revanth-reddy #mahesh-babu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి