అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చైర్మన్ గా బాలీవుడ్ నిర్మాత బాలీవడ్ ప్రముఖ దర్శకనిర్మాత అశుతోష్ గోవారికర్.. 10వ అజంతా ఎల్లోరా ఫిలిం ఫేర్ అవార్డ్స్ (AIFF) చైర్మన్ గా ఎంపికయ్యారు. ఛత్రపతి శివాజీ నగర్ లో ఈ ఫిలిం ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. 2025 జనవరి 15 నుంచి 19 వరకు సుమారు ఐదు రోజుల పాటూ ఈ ఫెస్టివల్ జరగనుంది. By Anil Kumar 24 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి బాలీవడ్ ప్రముఖ దర్శకనిర్మాత అశుతోష్ గోవారికర్.. 10వ అజంతా ఎల్లోరా ఫిలిం ఫేర్ అవార్డ్స్ (AIFF) చైర్మన్ గా ఎంపికయ్యారు. ఛత్రపతి శివాజీ నగర్ లో ఈ ఫిలిం ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు 2025 జనవరి 15 నుంచి 19 వరకు సుమారు ఐదు రోజులా పాటూ ఈ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫిలిం ఫెస్టివల్ ని మరాఠ్వాడా ఆర్ట్, కల్చర్ మరియు ఫిల్మ్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. బాలీవుడ్ లో లగాన్ , స్వదేస్ , జోధా అక్బర్ మరియు పానిపట్ వంటి సినిమాలతో నిర్మాతగా మంచి గురింపు తెచ్చుకున్నారు అశుతోష్ గోవారికర్. నిర్మాతగానే కూండా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా భారతీయ సినిమాకు విశేష కృషి చేసిన ఆయన.. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా తనదైన ముద్ర వేశారు. ఆస్కార్ అవార్డులను అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ఆయన కూడా ఓ మెంబర్ కావడం విశేషం. అదృష్టంగా భావిస్తున్నా.. కాగా AIFF కు చైర్మన్ గా ఎంపికవ్వడంపై అశుతోష్ తన ఆనందాన్ని పంచుకున్నారు." AIFF యొక్క 10వ సంవత్సరంలో గౌరవాధ్యక్షుని పాత్రను చేపట్టడం నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ఫెస్టివల్‌లో నన్ను చాలా ఉత్తేజపరిచేది ఏమిటంటే, ఇందులో చురుగ్గా పాల్గొంటున్న ప్రముఖ దర్శకులు-చంద్రకాంత్ కులకర్ణి, జయప్రద్ దేశాయ్, జ్ఞానేష్ జోటింగ్ సునీల్ సుక్తాంకర్ ఫెస్టివల్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇది ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్‌లో నిజమైన కళాత్మక మార్పును ప్రోత్సహిస్తుంది. అలాగే ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్)లో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం, గొప్ప చారిత్రక మూలాలు కలిగిన శక్తివంతమైన సాంస్కృతిక కేంద్రం, స్థానిక ప్రతిభను పెంపొందించడానికి మరియు ప్రపంచానికి పరిచయం చేయడానికి సహాయపడుతుంది. నా స్వంత మార్గంలో AIFFకి సహకారం అందించడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ పేర్కొన్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి