Mahesh Babu: ప్లీజ్ ఫోన్ స్విచాఫ్ చేయకు బ్రదర్... వైరల్ అవుతున్న మహేష్ బాబు ట్వీట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా  'లిటిల్ హార్ట్స్' చిత్రబృందాన్ని అభినందిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ  ట్వీట్ లో మహేష్ బాబు' లిటిల్ హార్ట్స్' మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్‌ను ఉద్దేశిస్తూ చేసిన  ఫన్నీ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

New Update

Mahesh Babu: చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది  'లిటిల్ హార్ట్స్'. టీనేజ్ లవ్ స్టోరీ, ఫ్రెండ్స్, కాలేజ్, మిడిల్ క్లాస్ ఫాదర్స్ మెంటాలిటీ వంటి అంశాలను కలగలుపుతూ మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దీనిని రూపొందించారు. సినిమాలోని కామెడీ సీన్స్, పంచ్ డైలాగ్స్, హీరోహీరోయిన్ల సంభాషణలు   ప్రతీదీ నవ్వులు పూయిస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే నాని, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు సినిమాను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా  'లిటిల్ హార్ట్స్' చిత్రబృందాన్ని అభినందిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

ఫోన్ స్విచాఫ్ చేయద్దు.. 

ఈ  ట్వీట్ లో మహేష్ బాబు' లిటిల్ హార్ట్స్' మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్‌ను ఉద్దేశిస్తూ చేసిన  ఫన్నీ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. సింజిత్‌ నువ్వు ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ చేసి ఎక్కడికీ  వెళ్ళకు  బ్రదర్‌.. ఎందుకంటే కొన్నిరోజుల్లో నువ్వు   చాలా బిజీగా మారిపోతావ్‌.. అని అన్నారు. అయితే మహేష్ ప్రత్యేకించి  మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ను అలా అనడానికి కారణం ఉంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న  సింజిత్  తానూ మహేష్ బాబుకు వీరాభిమానినని చెప్పాడు. అంతేకాదు ఆయన లిటిల్ హార్ట్స్ సినిమా గురించి పోస్ట్ పెడితే తన ఆనందానికి హద్దులుండవని అన్నారు. ఆనందంతో ఫోన్ స్విచాఫ్ చేసి ఒక వారం రోజులు ఎటైనా వెళ్లిపోతానని చెప్పారు. అందుకే మహేష్ బాబు తన ట్వీట్ లో సింజిత్‌ను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది. 

కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. అదే వారం విడుదలైన  'ఘాటీ'  వంటి పెద్ద సినిమాలకు పోటీగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ జోరు కొనసాగించింది. సినిమాలోని నటీనటులంతా చిన్నవారు అయినప్పటికీ తమ నటనతో ప్రేక్షకులను ఫిదా చేశారు. యంగ్ అండ్ డెబ్యూ డైరెక్టర్ సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మౌళి, శివాని నగరం హీరో హీరోయిన్లుగా నటించగా.. రాజీవ్ కనకాల, SS కంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 

Also Read: Shanmukh Jaswanth: 'ప్రేమకు నమస్కారం' అంటున్న షణ్ముఖ్.. కొత్త సినిమా గ్లింప్స్ అదిరింది బ్రో !

Advertisment
తాజా కథనాలు