Mahesh Babu : అప్పటి వరకు నా సినిమాలను డబ్‌ చేయొద్దు : మహేష్ బాబు

రాజమౌళి ప్రాజెక్ట్‌తోనే హిందీ ఆడియన్స్‌ను పలకరించాలని మహేశ్‌ బాబు ఫిక్స్‌ అయ్యారట. అందుకే ‘#SSMB29’ విడుదలయ్యే వరకు తన గత చిత్రాలను హిందీలోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది.

author-image
By Anil Kumar
mahesh
New Update

SSMB 29 Movie:

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందనున్న ఈ సినిమా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరి కొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా విషయంలో మహేష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ వైపు తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకుని ఫిజిక్ పై దృష్టి సారించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి ప్రాజెక్ట్‌తో మహేశ్‌ పాన్‌ వరల్డ్‌ ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బాలీవుడ్‌ వెండితెరపై ఈ సినిమాతోనే హిందీ ఆడియన్స్‌ను పలకరించాలని ఆయన ఫిక్స్‌ అయ్యారట. అందుకే ‘#SSMB29’ విడుదలయ్యే వరకు తన గత చిత్రాలను హిందీలోకి డబ్‌ చేసి థియేటర్‌లలో రిలీజ్‌ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది.

Also Read  : నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ

ఇప్పటి వరకు మహేశ్‌ నేరుగా ఏ హిందీ సినిమాలోనూ నటించలేదు. దీంతో బాలీవుడ్‌లో ఇదే తన తొలి చిత్రమవుతుందని ఆసక్తిగా ఉన్నారు. అందుకే అక్కడి ఆడియన్స్‌ను అలరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు ఈ మూవీ అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు.  తన సినిమాల గురించి ప్రెస్‌ మీట్‌ పెట్టి అప్‌డేట్స్‌ ఇవ్వడం రాజమౌళికి అలవాటు. మహేశ్‌ మూవీ విషయంలోనే ఇదే పద్ధతిని అనుసరించాలని భావిస్తున్నారు.

అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. ఈ క్రమంలోనే అక్టోబరు 10న రాజమౌళి బర్త్డే స్పెషల్ గా SSMB29 నుండి అప్డేట్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఆ రోజు మూవీకి సంబంధించి ప్రీ లుక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాను నిర్మాత కె.ఎల్. నారాయణ సుమారు వెయ్యి కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2027 లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

#ssmb29 #mahesh-babu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe