/rtv/media/media_files/2025/01/07/hMO3NDwmmuvcCrJbn2cB.jpg)
Nayanatara
Nayanthara: ధనుష్- నయనతార కాపీరైట్ వివాదంలో మద్రాస్ హైకోర్టు నయనతారకు బిగ్ షాకిచ్చింది. అయితే కొన్ని రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ సంస్థ నయనతార డాక్యుమెంటరీకి విషయంలో ధనుష్ వేసిన కాపీరైట్ దావాను కొట్టివేయాలంటూ కోర్టులో పిటీషన్ వేసింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నెట్ ఫ్లిక్స్ సంస్థ పిటీషన్ ను కొట్టివేసింది. ధనుష్ కి అనుకూలంగా తీర్పు వెలువడింది.
#Madrashighcourt
— Bar and Bench (@barandbench) January 28, 2025
Justice Abdul Quddhose dismisses Netflix India's application to reject the grant of leave to actor Dhanush's Wunderbar films to file a copyright infringement suit and implead it as a party amidst the row over Nayanthara's documentary. pic.twitter.com/BoOdbCjIC3
అసలేం జరిగిదంటే..
ప్రముఖ ఓటీటీ ప్లాట్ నెట్ ఫ్లిక్స్ ఇండియా నయనతార పెళ్లి, జీవిత విశేషాలతో 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' అనే పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. గతేడాది నవంబర్ 18న విడుదలైన ఈ డాక్యుమెంటరీ వీడియోలో.. తన అనుమతి లేకుండా తాను నిర్మించిన (నానున్ రౌడీ దాన్) సినిమాలోని 3 సెకన్ల వీడియో క్లిప్ ను వాడుకోవడంపై ధనుష్ సీరియస్ అయ్యారు. కాపీరైట్ యాక్ట్‌లో భాగంగా రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపారు. 'నానున్ రౌడీ దాన్' నయన్ భర్త విగ్నేష్ శివన్ తెరకెక్కించగా నయనతార- విజయ్ సేతుపతి జంటగా నటించారు. ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు.
ధనుష్ పై నయన్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు ధనుష్ లీగల్ నోటీసులపై స్పందించిన నయనతార సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగతంగా తనపై ఇంత కక్ష పెట్టుకోవడం కరెక్ట్ కాదంటూ మూడు పేజీల లేఖను విడుదల చేసింది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్' చిత్రం డాక్యుమెంటరీలో భాగం కాకపోవడం ఎంతో బాధాకరమని. సినిమాలోని వీడియోలు, పాటలు, ఫొటోలు ఉపయోగించుకోవడానికి కావాల్సిన NOC కోసం దాదాపు రెండేళ్లు ఫైట్ చేశాము. చివరికి మీరు పర్మిషన్ ఇవ్వకపోవడంతో రీ ఎడిట్ చేశామని. ఆ సినిమా పాటలు వాడుకోవడానికి అనుమతించకపోవడం తన హృదయాన్ని ముక్కలు చేసింది అంటూ ధనుష్ పై ఆరోపణలు చేసింది.
Also Read: నయనతారపై ధనుష్ కేసు.. 10 కోట్లు డిమాండ్, హీరోయిన్ సంచలన ఆరోపణలు