/rtv/media/media_files/2025/09/26/madharaasi-ott-2025-09-26-16-29-47.jpg)
Madharaasi OTT
Madharaasi OTT:
శివకార్తికేయన్(Sivakarthikeyan) హీరోగా, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ మదరాసి ఈ ఏడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
కానీ, ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం విశేషం. ముఖ్యంగా తమిళంలో మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ కోసం రెడీ అవుతోంది.
Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?
#Madharasi - Coming 2 Days Earlier Itself 🤩
— Webseries Lovers 2.0 (@Webseries0) September 26, 2025
From #October1 (Wednesday) on @PrimeVideoIN
In #Tamil, #Telugu, #Malayalam, #Kannada & #Hindi
Follow: @Webseries0pic.twitter.com/GR7hvNWBrL
అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను అక్టోబర్ 1, 2025 నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్ విడుదల తర్వాత కేవలం 4 వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి రావడం విశేషం.
Also Read : ఏం ఫీలుంది మామ! జోగిపేట్ శ్రీకాంత్ ఈజ్ బ్యాక్ .. ఈ సంక్రాంతికి పండగే
ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది. ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే, యాక్షన్ హీరో విద్యుత్ జామ్వాల్, శబీర్, బిజు మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మసాలా యాక్షన్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా మురుగదాస్ గత హిట్స్ దర్బార్, సికిందర్ స్టైల్లో సాగింది. అయితే, కొన్ని సన్నివేశాలు, కథన శైలి అందరినీ ఆకట్టుకోలేకపోయాయి.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలకు మంచి స్పందన లభించింది. BGMకి కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ పతాకంపై ఎన్.వి. ప్రసాద్ నిర్మించారు. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయొచ్చు. మొత్తానికి, మిక్స్‌డ్ టాక్ వచ్చినా, భారీ కలెక్షన్లతో దూసుకెళ్లిన మదరాసి ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది.