/rtv/media/media_files/2025/06/30/maadi-maadi-video-song-released-2025-06-30-21-41-10.jpg)
Maadi Maadi Video Song released
Kuberaa Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున నటించిన ‘కుబేర’ మూవీ మంచి హిట్ అందుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టింది. విడుదలైన వారాంతంలోనే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇంకా మూవీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ఈ మూవీ నుంచి మేకర్స్ సర్ ప్రైజ్ అందించారు. ఈ చిత్రం నుంచి ‘మాది మాది’ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
బిచ్చగాడిగా ధనుష్
సోషల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన వ్యక్తికి.. వీధుల్లో నివసించే బిచ్చగాడికి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా కథ. ఇందులో నాగార్జున ప్రభుత్వ అధికారి పాత్రను పోషించగా.. ధనుష్ 'బిచ్చగాడి' పాత్రను పోషించారు. ధనుష్ పాత్ర ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకుంది. అలాగే సినిమాలోని రియల్ లొకేషన్స్, వాస్తవిక కథాంశం హైలైట్ గా కనిపించాయి. 'లవ్ స్టోరీ' తర్వాత 'కుబేరా' తో వరుస హిట్లు అందుకున్నారు శేఖర్ కమ్ముల.